Moviesఅమ్మ బాబోయ్.. ఈ హనీ రోజ్ మామూల్ది కాదురోయ్.. డబ్బులు అలా...

అమ్మ బాబోయ్.. ఈ హనీ రోజ్ మామూల్ది కాదురోయ్.. డబ్బులు అలా కూడా సంపాదించేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చాక .. కొన్ని కొన్ని వదిలేసుకోవాలి . అలా వదిలేసుకుంటేనే అవకాశాలు వస్తాయి . తద్వారా డబ్బులు సంపాదించుకోగలరు . లేదు అంటూ వీర్రవీగా రా అంతే సంగతులు . ఆఫర్లు రావు ఆ తర్వాత డబ్బులు రావు . అది బాగా గమనించింది హనీ రోజ్.. అందుకే తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . టాలీవుడ్ లో పలు సినిమాలో నటించిన రాని క్రేజ్ గుర్తింపు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించగానే వచ్చింది.

ఈ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అయినా ఏం లాభం ఆ తర్వాత బోలెడు ఆఫర్స్ వచ్చినా.. సరే కథ నచ్చలేదు ..రెమ్యూనరేషన్ నచ్చలేదు అంటూ పలు ఛాన్సెస్ ని రిజెక్ట్ చేసింది. అప్పుడు ఎప్పుడో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ఆఫర్ వచ్చిందని ఆ తర్వాత విశ్వంభరలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించిన.. అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసారు జనాలు . అయితే రీసెంట్గా హానీ రోజ్ కి సంబంధించిన ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది .

హనీ రోజ్ సినిమా ఆఫర్స్ లేకపోయినా డబ్బులు బాగా సంపాదిస్తుందట . దానికి కారణం షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ . చిన్నది పెద్దది అని తేడా లేకుండా అన్ని షాప్స్ ఓపెనింగ్ కి ముందడుగు వేస్తుంది హనీ రోజ్ . అంతేకాదు ఒక షాపు ఓపెనింగ్ చేస్తే ఆ స్థాయికి తగ్గట్టే ఛార్జ్ చేస్తుంది . 20 లక్షల నుంచి 50 లక్షల కూడా తీసుకుంటుందట. అమ్మడు ఇలా నెలకు ఒక ఆరు ఏడు పైగానే షాప్ ఓపెనింగ్ చేస్తుందట . ఇంకేముంది సినిమాలు లేకపోయినా సరే చేతుల్లో లక్ష్మీదేవి వచ్చేస్తుంది . అందుకే ప్రశాంతంగా కూల్ గా ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . రీసెంట్ గా కూడా ఒక జ్యువెలరీ షాప్ ను ఓపెన్ చేసిందట..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news