Movies"నా పెళ్లిలో అలాంటి ఏవి ఉండవు..మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి".. రకుల్...

“నా పెళ్లిలో అలాంటి ఏవి ఉండవు..మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి”.. రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ స్టేట్మెంట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో పెళ్లి పీటలు ఎక్కబోతుంది . ఫిబ్రవరి 21న గ్రాండ్ గా గోవాలో వీళ్ళ పెళ్లి జరగబోతుంది . వీళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు మొత్తం చకచకా కంప్లీట్ చేసేసుకుంటున్నారు . అంతేకాదు వీళ్ళ పెళ్లికి సంబంధించిన ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్ .

తన పెళ్లి తనకు ఇష్టమైన విధంగా నచ్చే విధంగా చేసుకోవాలి అని డిసైడ్ అయిందట . అందుకే గోవాలో వెడ్డింగ్ డెస్టిని ప్లాన్ చేసుకున్న రకుల్ తనకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకుంటుందట . అంతేకాదు జనరల్గా పెళ్లి అంటే టపాసులు పేల్చడం సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది . అయితే రకుల్ మాత్రం తన పెళ్లిలో అలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట . పెళ్లిలో ఎలాంటి టపాసులు బాంబులు పేల్చద్దు అని చెప్పేసిందట .

పాశ్చాత్య సంప్రదాయానికి వీడ్కోలు పలికి ఎకో వెడ్డింగ్ కి ముందడుగు వేయాలి అని ఈ నిర్ణయం తీసుకుందట . తన పెళ్లిలో టపాసులు వద్దన్నా మొదటి హీరోయిన్ రకుల్ అంటూ జనాలు పొగడేస్తున్నారు. రకుల్ తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు . రకుల్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ విషెస్ అందిస్తున్నారు. ప్రెసెంట్ రకుల్ తన పెళ్లి పనుల్లో బిజీగా ఉంది . ఆమె చివరిగా నటించిన సినిమా ఆయాలన్. తర్వాత ఇండియన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news