Movies"అందరూ అనుకున్నంత పనే చేసిన సమంత"..నాగచైతన్య గెస్సింగే కరెక్ట్ అయ్యిందిగా..సైలెంట్ గానే...

“అందరూ అనుకున్నంత పనే చేసిన సమంత”..నాగచైతన్య గెస్సింగే కరెక్ట్ అయ్యిందిగా..సైలెంట్ గానే ఏం షాక్ ఇచ్చింది రా బాబు..!!

నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే ఆ తర్వాత వీళ్ళు కలుసుకున్నదే లేదు . కానీ పలు ఇంటర్వ్యూలలో పరోక్షకంగా సమంత – నాగచైతన్య పై మండిపడింది . సమంత పై మాత్రం నాగచైతన్య ఎప్పుడు కూల్ గా ఆన్సర్ ఇస్తూనే వచ్చాడు . సమంత చాలా మంచిది అని.. తాను అనుకున్నది సాధిస్తుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

ప్రజెంట్ అదే కామెంట్ చేస్తున్నారు అభిమానులు . సమంత అనుకున్నది సాధిస్తుంది అని.. నాగచైతన్య చెప్పింది నిజం అంటూ ఓ వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు . సమంత తాజాగా పాశ్ క్యాస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది . అందులో హెల్త్ గురించి చెప్తుంది . “టేక్ 20 అనే పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేశాను .. ఇందులో కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను మాత్రమే చెపుతాను .. ఈ రెండేళ్లుగా నేను అనుభవించిన బాధ బయోసైటిస్ నుంచి నేను ఎలా కోలుకున్నాను అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది”..

“ఇది అందరి జీవితాలను మార్చే విధంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఇందులో చెప్పేవి చాలా సంవత్సరాలు అనుభవం ఉన్న రీసెర్చ్ చేసినవి ..జాయిన్ అవ్వండి మనం నేర్చుకుందాం ..మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అంటూ చెప్పుకొచ్చింది . ప్రెసెంట్ ఈ ప్రోమో బాగా వైరల్ అవుతుంది. దీని పూర్తి వీడియో ఫిబ్రవరి 19న రానున్నట్లు చెప్పుకొచ్చింది . దీంతో అందరు సమంతకి విషెస్ అందిస్తున్నారు. లైఫ్ లో నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలి అంటూ కోరుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news