Movies"మళ్ళీ నా కొత్త ప్రయాణం మొదలు".. ఒక్క పోస్టుతో సోషల్ మీడియాని...

“మళ్ళీ నా కొత్త ప్రయాణం మొదలు”.. ఒక్క పోస్టుతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మెగా డాటర్..!

మెగా డాటర్స్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా మెగా డాటర్ శ్రీజ.. మెగా డాటర్ నిహారిక ఎప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతూ ఉంటారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎంతో మంది డివర్స్ తీసుకున్న సరే వీళ్ళిద్దరే ప్రపంచంలో మొట్టమొదటిసారి డివర్స్ తీసుకున్న మహిళలు అనే విధంగా చులకనగా చూస్తూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

అయితే అలాంటి వాళ్లను పెద్దగా పట్టించుకోని మెగా డాటర్స్ తమ పని తాము చూసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. నిహారిక పలు సినిమాలలో నటిస్తూ సినిమాలను నిర్మిస్తూ బిజీబిజీగా ముందుకెళ్తుంది . అయితే శ్రీజ కూడా తన లైఫ్ కి సంబంధించి కొన్ని కీలక డెసిషన్ తీసుకున్నట్లు తాజా పోస్ట్ ద్వారా తెలుస్తుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే శ్రీజ..” 2023లో నేను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. నా బలాన్ని కనుగొన్నాను ..కొత్త ప్రయాణం మొదలైంది” అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

ఆ పోస్ట్ ఎంతగానో వైరల్ అయింది . కాగా రీసెంట్ గా శ్రీజ మరో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ” యు ఆర్ యువర్ బెస్ట్ చీర లీడర్” అంటే దాని అర్ధం.. “నీకు నువ్వే ఉత్తమమైన చీర లీడర్ “. దీంతో పాటు శ్రీజ వర్కౌట్స్ చేస్తున్న ఫోటో కూడా వైరల్ గా మారింది . శ్రీజ మిగతా పనులు ఏమి పట్టించుకోకుండా తన లైఫ్ తాను ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయింది అని .. అందుకే ఫిట్నెస్ గా ఉండడానికి ఇలా జిమ్లో చెమటలు చిందిస్తుంది అని.. శ్రీజ మంచి నిర్ణయం తీసుకుంది అని .. ఇది ఆమెకు కొత్త ప్రయాణం అని మెగా ఫాన్స్ పొగడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news