Movies"సాయి పల్లవికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది"..బిగ్ బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరో..!!

“సాయి పల్లవికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది”..బిగ్ బాంబ్ పేల్చిన టాలీవుడ్ హీరో..!!

ఇది నిజంగా సాయి పల్లవి అభిమానులకు గుండెలు బ్లాస్ట్ అయ్యే న్యూస్ అని చెప్పాలి. హీరోయిన్ సాయి పల్లవికి పెళ్లయిపోయిందా..? అంటే అవునని అంటున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో . అయితే అది నిజంగా చేసిన కామెంట్స్ కాదు .. చాలా సరదాగా ఫన్నీగా చేసినవి. కానీ సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు సాయి పల్లవికి నిజంగానే పెళ్ళి అయిపోయింది అంటూ ఆ కారణంగానే ఆ హీరో అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటూ వార్తలను ట్రోల్ చేస్తున్నారు .

హీరో నాని సాయి పల్లవి పై గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గతంలో నాని – సాయి పల్లవి సినీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు
. ఈ క్రమంలోనే నాని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”ఇప్పుడు మీకు నేను ఒక ఎక్స్ క్లూజివ్ ప్రోమో ఇవ్వబోతున్నాను.. అందుకే ఇంత ఫీల్ తో చెబుతున్నాను.. సాయి పల్లవికి ఎప్పుడు పెళ్లి అయిపోయింది “అంటూ చెప్పుకొస్తాడు .

“ఆమెకు నిజంగానే పెళ్ళి అయిపోయింది “అంటూ మళ్ళీ కూడా చెప్పుకొస్తాడు . అయితే నాని ఇది చాలా సరదాగా చెప్పుకొస్తాడు. నాని మాటలకు నవ్వుకుంటూ సాయి పల్లవి..” ఈ వీడియో మా అమ్మ చూస్తే నా పని అయిపోతుంది.. అమ్మ తప్పకుండా నాన్నకి ఫోన్ చేస్తుంది “అంటూ సరదాగా నవ్వుతుంది . దీనికి మళ్లీ స్పందించిన నాని..” చేస్తే చేయనివ్వు ఏమవుతుంది ఆంటీ తో ఫోన్ నేను మాట్లాడుతాను” అంటూ సరదాగా అనడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుకుంటారు.

అయితే ఇది మొత్తం చాలా ఫన్నీగా జరిగిన కొందరు జనాలు మాత్రం నిజంగానే సాయి పల్లవికి పెళ్లి అయిపోయింది అని నమ్ముతున్నారు. ఏ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రూఫ్ లేకుండా నాని అలా మాట్లాడడు. నాని అలా మాట్లాడాడు అంటే నిజంగా సాయి పల్లవి కి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉండనే ఉంటాడు. సైలెంట్ గా పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. అందుకే వాళ్ళ చెల్లెలు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది అంటూ ఎక్కడికెక్కడికో ముడిపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ సాయి పల్లవి పెళ్లి న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news