Movies"అంత పెద్ద మాట ఎలా అంటావు..?"..లైవ్ లోనే అనుపమకు ఇచ్చిపడేసిన రవితేజ(వీడియో)..!!

“అంత పెద్ద మాట ఎలా అంటావు..?”..లైవ్ లోనే అనుపమకు ఇచ్చిపడేసిన రవితేజ(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మాస్ మహారాజ రవితేజ ఎప్పుడు కూడా చాలా సరదాగా జోవియల్ గా మాట్లాడుతూ ఉంటాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే . తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ అయినా .. చేయని హీరోయిన్స్ అయినా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల వర్షం కురుస్తుంది . రీసెంట్గా రవితేజ నటించిన సినిమా ఈగల్ .

ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో కావ్య ధాపర్ – అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు . అవసరాల శ్రీనివాస్ , నవదీప్ , మధుబాల ముఖ్యపాత్రులు పోషించి మెప్పించబోతున్నారు . సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూను కూడా కండక్ట్ చేసింది. ఈ ఇంటర్వ్యూ చాలా సరదా సరదాగా సాగిపోయింది.

ఈ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ డైరెక్టర్ కార్తీక్ ను అన్నయ్య అంటూ పిలుస్తుంది . దీంతో రవితేజ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా..? అంటూ వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు . వెంటనే బేసిక్ గా అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదం వాడకూడదు.. తెలుసుకో అంటూ చెప్పుకొస్తాడు . అయితే అనుపమ నేను అతనితో కలిసి నాలుగో సినిమా చేస్తున్నాను ..మా మధ్య ఆ ర్యాపో ఉంది అందుకే అలా పిలుస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది . వెంటనే అవసరాలు శ్రీనివాస్ అయితే మేము మూడు సినిమాలు చేసి ఆపేస్తాం మీతో.. అంటూ కౌంటర్ వేస్తాడు . ఇంతలో నవదీప్ చూడు నువ్వు కార్తీక్ నీ అన్నయ్య అనగానే ఎంత బాధ పడుతున్నాడో అంటూ చెప్పుకొస్తాడు . ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news