Moviesఅందుకోసం స్వయంగా సాయిపల్లవిని కలిసిన సుకుమార్.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే...

అందుకోసం స్వయంగా సాయిపల్లవిని కలిసిన సుకుమార్.. ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ హీరోయిన్ సాయి పల్లవిని కలిసారా..? అంటే అవుననే అంటుంది ఫిలిం ఇండస్ట్రీ . ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్స్ లో బిజీగా ఉన్న సుకుమార్ ఇలా ఉన్నపలంగా సాయిపల్లవిని డైరెక్ట్ గా కలిసి మీట్ అయ్యాడు అని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఫిలిం ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..పుష్ప2లో సాయి పల్లవిని భాగం చేయాలి అనుకుంటున్నాడు అని ..ఆ కారణంగానే సుకుమార్ ప్రత్యేకంగా ఆమెను కలిసి రిక్వెస్ట్ చేశారు అన్న వార్త వైరల్ అవుతుంది. కొందరు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సాయి పల్లవిని చూస్ చేసుకున్నాడు సుకుమార్ అంటుంటే మరికొందరు మాత్రం కాదు కాదు కాదు అని.. ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ సాయి పల్లవికి ఇవ్వబోతున్నాడు అని చెప్పుకొస్తున్నారు.

ఐటమ్ సాంగ్ అయితే సాయి పల్లవి చచ్చిన చేయదు . అది అందరికీ తెలిసిందే. బహుశా సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర అయ్యుంటుంది. లేకపోతే ఎందుకు సుకుమార్ ఇలా స్వయంగా ఆమెను కలవడానికి వెళ్తాడు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాని మాత్రం షేక్ చేసి పడేస్తుంది. చూద్దాం దీని పై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news