Movies"అలా చేయాలి అని ఉంది"..మనసులోని కోరికను బయటపెట్టిన ప్రియమణి..!!

“అలా చేయాలి అని ఉంది”..మనసులోని కోరికను బయటపెట్టిన ప్రియమణి..!!

ప్రియమణి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది . బాలకృష్ణ – నితిన్ – జగపతిబాబు లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . అంతేకాదు ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో నటించి తన కెరియర్ను మలుపు తిప్పుకొనింది.

ఆ తర్వాత వ్యక్తిగతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఇండస్ట్రీకి దూరమైంది . మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఎవ్వరికి అందనంత హై రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది . రీసెంట్గా నటించిన సినిమా “ఆర్టికల్ 360” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి బిజీ బిజీగా వెళుతుంది.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రియమణి ..”కెరియర్ లో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో నటించాలి అనుకుంటున్నాను అని ఎప్పుడు సీరియస్ గా ఉండే పాత్రలే కాకుండా నవ్వుతూ రొమాంటిక్గా కామెడీగా ఉండే పాత్రలు కూడా చేయాలి అనుకుంటున్నానని ..అలాంటి వాటి కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది “. దీంతో ప్రియమణి మనసులోని కోరికను బయట పెట్టడంతో జనాలు ఈగర్ గా అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా ప్రియమణి కామెడీ జోనర్ లో కూడా మెప్పిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news