Moviesప్రభాస్‌ - మారుతి సినిమా టైటిల్‌ వచ్చేసిందోచ్..లుంగీలో కేక పెట్టిస్తున్న మన...

ప్రభాస్‌ – మారుతి సినిమా టైటిల్‌ వచ్చేసిందోచ్..లుంగీలో కేక పెట్టిస్తున్న మన డార్లింగ్.. ఇక అరుపులే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ రీసెంట్గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు రెబల్ అభిమానులకు . ప్రభాస్ మరో అద్భుతమైన సర్ప్రైజ్ ని ఇచ్చాడు . ఆయన నెక్స్ట్ నటిస్తున్న మారుతీ దర్శకత్వంలోని సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్స్ రిలీజ్ చేశారు . మారుతీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు .

వింటేజ్ ప్రభాస్ సోషల్ మీడియాని రచ్చ రచ్చ చేస్తున్నాడు . డార్లింగ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సంక్రాంతి ట్రీట్ వచ్చేసింది . మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ కమర్షియల్ సినిమాకు “రాజా సాబ్ ” అంటూ క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేశారు . ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు . ఈ లుక్ లో ప్రభాస్ బ్లాక్ షర్ట్ తో లుంగీ కట్టుకొని ఊర నాటుగా కనిపించారు .

అంతేకాదు ప్రభాస్ చాలా యంగ్ గా కనిపించాడు . దాదాపు 15 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయినా ప్రభాస్ ని మనం ఈ లుక్ లో చూడొచ్చు . ఫస్ట్ లుక్ తోనే సోషల్ మీడియాని షేక్ చేసి పడేసాడు .ఈ రాజా సాబ్. ఇక సినిమా రిలీజ్ అయింది అంటే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హర్రర్ ఎలిమెంట్లతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . ఫుల్ కామెడీ సెంటిమెంట్ కూడా ఉండబోతున్నాయట . ప్రజెంట్ “రాజా సాబ్” లుక్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news