Movies"సూసేటి అగ్గిరవ్వ..నా సామి"..పుష్ప 2 నుంచి ఊర నాటు మాస్ సాంగ్...

“సూసేటి అగ్గిరవ్వ..నా సామి”..పుష్ప 2 నుంచి ఊర నాటు మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్.. శ్రీవల్లి వదిన చించ్చేసిందిగా(వీడియో)..!

సోషల్ మీడియాలో ఏ పేరు కనిపించిన సరే జనాలు చూసి చూడనట్లు వదిలేస్తారేమో కానీ.. పుష్ప అన్న పేరు వినపడితే మాత్రం ఓ రేంజ్ లో గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి.. పూనకాలు వచేస్తూ ఉంటాయి.. ఆ రేంజ్ లో సినిమాపై హైప్ పెంచేశారు అల్లు అర్జున్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2.. ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ లీకైన రిలీజ్ అయిన అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ని ఆపలేము.

ఓ రేంజ్ లో హంగామా చేసేస్తూ ఉంటారు . కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి సుకుమార్ పుష్ప పుష్ప పుష్ప అంటూ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు . కాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసే ముహూర్తం దగ్గర పెట్టేశారు. దగ్గరకు వచ్చేసింది . తాజాగా ఈ ప్రోమో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటున్న వీడియోని రిలీజ్ చేశారు. ” శ్రీవల్లి వదిన పుష్ప2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా ..అంటూ అడగ్గా.. ఆ పాట ఏదో చెప్తావా అని అడిగిన మూమెంట్లో రష్మిక చైర్ లో నుంచి లేస్తూ ఓకే అంటూ “సూసేటి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ”సాంగ్ అంటూ తగ్గేదెలా స్టెప్స్ ను రీ క్రియేట్ చేసి వేస్తుంది.

చిన్న లైన్ తోనే సినిమాలో ఈ పాట హైలైట్ గా మారబోతుంది అంటూ హింట్ ఇచ్చేశారు . ప్రసెంట్ ఈ ప్రోమో వైరల్ అవుతుంది. కాగా ఈ రెండో పాట మే 29న 11:07 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. పుష్ప వన్ లో నా స్వామి నా స్వామి పాట ఎంత హిట్ అయిందో పుష్ప2లో సూసైటి అగ్గి రవ్వ సాంగ్ కూడా అంతే హిట్ అవుతుంది అంటూ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతూ ఉంటే పుష్ప2 పాన్ ఇండియా లెవెల్ కాదు గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అన్న విషయం క్లారిటీకి వచ్చేస్తుంది . చూద్దాం మరి ఈ సూసేటీ అగ్గి రవ్వసామి ఎలాంటి అగ్ని రాజేస్తాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news