Moviesబాల‌య్య 109పై సూప‌ర్ అప్‌డేట్‌... ఊర‌మాస్‌.. ఊచ‌కోత‌

బాల‌య్య 109పై సూప‌ర్ అప్‌డేట్‌… ఊర‌మాస్‌.. ఊచ‌కోత‌

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గ‌తేడాది ఏకంగా రెండు సూప‌ర్ హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. సంక్రాంతికి వీర‌సింహారెడ్డి, ద‌స‌రాకు భ‌గ‌వంత్ కేస‌రి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ప్ర‌స్తుతం యువ‌ దర్శకుడు కొల్లి బాబీతో తన కెరీర్ 109వ సినిమా చేస్తుండ‌గా.. ఈ సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

బాలయ్య వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత వస్తున్న సినిమా కావ‌డం, అటు బాబి చిరంజీవితో వాల్తేరు వీర‌య్య సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాక బాబి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక మేక‌ర్స్ ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతంలో లేటెస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లోనే మెయిన్ లీడ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. సినిమాలో మాస్‌కు కిక్ ఇచ్చే యాక్ష‌న్ సీన్ల‌లో బాల‌య్య ఊచ‌కోత కోడిప‌డేస్తాడంటున్నారు. ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news