Moviesఆ ఇద్ద‌రు హీరోయిన్ల కెరీర్ నాశ‌నం చేసిన నాగార్జున‌... దెబ్బ‌కు మ‌టాష్‌...!

ఆ ఇద్ద‌రు హీరోయిన్ల కెరీర్ నాశ‌నం చేసిన నాగార్జున‌… దెబ్బ‌కు మ‌టాష్‌…!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇద్ద‌రు హీరోయిన్ల కెరీర్ నాశ‌నం చేశాడ‌నే చెప్పాలి. నాగ్ వ‌య‌స్సులో కుర్ర‌వాడిగా క‌నిపించేందుకు నానా తాప‌త్ర‌య ప‌డుతున్నాడు. అయితే నాగ్ ఫేస్‌లో వ‌య‌స్సు పైబ‌డిన చాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు నాగ్ సినిమాల్లో ఆయ‌న‌కు జోడీగా హీరోయిన్ల కొర‌త కూడా వెంటాడుతోంది. ఇటీవ‌ల నాగార్జున ప‌క్క‌న న‌టిస్తోన్న సినిమాల్లో ఆయ‌న కంటే వ‌య‌స్సులో చాలా చిన్న హీరోయిన్లే న‌టిస్తున్నారు.

నాగ్ ప‌క్క‌న కుర్ర హీరోయిన్లు జోడీ క‌డుతుంటూ తెర‌మీద చూడ‌డానికే ఎబ్బెట్టుగా క‌నిపిస్తోంది. అస్స‌లు ఇటీవ‌ల కాలంలో నాగార్జున‌కు హీరోయిన్ల‌తో కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. నాగ్ ప‌క్క‌న ఉత్సాహంగా న‌టించిన కొంద‌రు కుర్ర క్రేజీ హీరోయిన్ల కెరీర్ మ‌టాష్ అయ్యింది. న‌య‌న‌తార, అనుష్క లాంటి ముదురు ముద్దుగుమ్మ‌లు అయితే నాగ్ ప‌క్క‌న బాగాసెట్ అవుతారు. వాళ్ల‌ను కాద‌ని కుర్ర హీరోయిన్ల‌ను తీసుకున్న నాగ్ వాళ్ల కెరీర్‌పై దెబ్బ కొట్టాడ‌నే చెప్పాలి.

మ‌న్మ‌థుడు 2 సినిమాకు ముందు ర‌కుల్‌ప్రీత్‌సింగ్ తెలుగులో మంచి ఫామ్‌లో ఉంది. బ‌న్నీ, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌తో వ‌రుస‌గా సినిమాలు చేసి స్వింగ్‌లో ఉంది. మ‌న్మ‌థుడు 2లో ర‌కుల్ – నాగ్ న‌టించ‌డం.. పైగా నాగ్‌కు లిప్‌కిస్ ఇచ్చాక అస్స‌లు ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు తెలుగులో ఎవ్వ‌రూ సాహ‌సించ‌లేదు. ఆ త‌ర్వాత ఆమె టాలీవుడ్‌కు దూర‌మైపోయింది. అలా అన‌డం కంటే ఆమెను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌నే చెప్పాలి.

మ‌న్మ‌థుడు సినిమా వ‌ల్లే ర‌కుల్‌ప్రీత్ సింగ్ కెరీర్ టాలీవుడ్‌లో ముగిసిపోయింద‌ని అంద‌రూ అంటారు. అంత‌కుముందు తెలుగ‌మ్మాయి అయిన వైజాగ్ పిల్ల పూన‌మ‌బ‌జ్వా కెరీర్ కూడా నాగార్జునే నాశ‌నం చేశాడ‌ని టాలీవుడ్ జ‌నాలు చెవులు కొరుక్క‌నేవారు. పూన‌మ్ బ‌జ్వా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్పుడు ఆమెది చాలా చిన్న వ‌య‌స్సు. నాగార్జున బాస్ సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర‌లో ఆమె న‌టించ‌డం ఆమె చేసిన పెద్ద త‌ప్పు.

ఆ సినిమా చేయ‌కుండా ఉంటే పూన‌మ్‌కు ఎన్టీఆర్‌, మ‌హేష్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్ లాంటి హీరోల స‌ర‌స‌న మంచి ఛాన్సులు వ‌చ్చి ఉండేవి. ఎప్పుడు అయితే నాగ్ లాంటి సీనియ‌ర్ ఏజ్ హీరో ప‌క్క‌న సినిమా చేసిందో ఆ త‌ర్వాత క్రేజీ హీరోలు ఆమెను ప‌ట్టించుకోలేదు. అలా బాస్ దెబ్బ‌తో ఆ త‌ర్వాత ఆమెకు ఛాన్సులు లేకుండా పోయాయి. అలా నాగ్ కుర్ర హీరోయిన్ల‌తో న‌టిస్తే వాళ్ల కెరీర్‌కు దెబ్బ‌ప‌డిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news