Moviesఆ ముద‌రు ఆంటీతో మెగాస్టార్ రొమాన్స్‌... బాబోయ్ వ‌ద్దంటోన్న మెగా ఫ్యాన్స్‌..!

ఆ ముద‌రు ఆంటీతో మెగాస్టార్ రొమాన్స్‌… బాబోయ్ వ‌ద్దంటోన్న మెగా ఫ్యాన్స్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గ‌తేడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన చిరు ఆగ‌స్టులో భోళాశంక‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి డిజాస్ట‌ర్ కొట్టారు. ఈ సినిమా ఎపిక్ డిజాస్ట‌ర్ అయ్యాక చిరు కాస్త గ్యాప్ తీసుకుని మోకాలి ఆప‌రేష‌న్ త‌ర్వాత ఇప్పుడు ఏకంగా యంగ్ డైరెక్ట‌ర్ మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభ‌ర సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. జ‌గ‌దేక‌వీరుడు అతిలోకసుంద‌రి స్టోరీ టైప్‌లో విశ్వంభ‌ర స్టోరీ కూడా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు వ‌శిష్ట ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఇద్ద‌రు, ముగ్గురు హీరోయిన్ల ఉంటార‌ని కూడా మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. చిరుకు జోడీగా త్రిష‌ను క‌న్‌ఫార్మ్ చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. గ‌తంలో త్రిష – చిరు కాంబోలో స్టాలిన్ సినిమా వ‌చ్చింది. అయితే ఇప్పుడు మెయిన్ హీరోయిన్‌పై మ‌రో రూమ‌ర్ న‌డుస్తోంది.

పెళ్ల‌య్యి.. ఓ బిడ్డ‌కు త‌ల్లి అయిన ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో కాజ‌ల్ – చిరు కాంబోలో ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆచార్య సినిమాలోనూ ముందు కాజ‌ల్‌నే హీరోయిన్‌గా తీసుకుని త‌ర్వాత ఆమెను త‌ప్పించారు. ఇప్పుడు అటూ ఇటూ తిరిగి మ‌ళ్లీ ఈ ముదురు ఆంటీనే తీసుకోవాల‌ని అనుకున్న‌ట్టు తెలుస్తోంది.

కాజ‌ల్ ఇటీవ‌లే బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలో న‌టించింది. ఇప్పుడు మ‌ళ్లీ చిరుకు జోడీగా ఎంపికైతే ల‌క్కీ ఛాన్సే అనుకోవాలి. అయితే మెగాభిమానులు మాత్రం చిరు ప‌క్క‌న త్రిష ముద్దు.. కాజ‌ల్ వ‌ద్దే వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news