Moviesకొత్త కాపురంపై మెగా కోడ‌లు లావ‌ణ్య ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందే......

కొత్త కాపురంపై మెగా కోడ‌లు లావ‌ణ్య ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందే… వామ్మో మామూల్దీ కాదు..!

మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న నార్త్ ఇండియ‌న్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి తెలుగింటి కోడ‌లు అయ్యింది. మిస్ట‌ర్‌, అంత‌రిక్షం సినిమాల్లో క‌లిసి న‌టించిన ఈ జంట ప్రేమ‌లో ప‌డి ఐదేళ్ల పాటు సీక్రెట్‌గా ప్రేమించుకుని.. ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట కొత్త కాపురం కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు హైద‌రాబాదే లావ‌ణ్య అత్తారిల్లు అయిపోయింది.

అస‌లు త‌న జీవితంలో ఇలాంటి సంఘ‌ట‌న ఎదుర‌వుతుంద‌ని తాను ఊహించ‌నే లేద‌ని.. మ‌న పెళ్లి ఎవ‌రితో అవుతుందో మ‌నం అస్స‌లు ఊహించ‌లేం.. వ‌రుణ్‌ను ప్రేమించ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగిందంటూ త‌న పెళ్లిపై లావ‌ణ్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. పెళ్ల‌య్యాక ఆమె కొత్త సినిమాలేవి ఒప్పుకోవ‌డం లేదు. అయితే మిస్ ప‌ర్‌ఫెక్ట్ అనే వెబ్‌సీరిస్ మాత్రం పూర్తి చేసింది.

ఇక కొత్త కాపురాన్ని ఉద్దేశించి లావ‌ణ్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లే చేసింది. లావ‌ణ్య త్రిపాఠి అనేది తాను క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న పేరు అని.. మెగా కోడ‌లు అనే ట్యాగ్‌లైన్ మాత్రం త‌న బాధ్య‌త మ‌రింత‌గా పెంచింద‌ని లావ‌ణ్య చెప్పింది. వ‌రుణ్‌ను పెళ్లాడాకే త‌న‌కు ఈ ట్యాగ్ వ‌చ్చింద‌ని.. మెగా కోడ‌లు అనే పిలుపు త‌న‌కెంతో ప్ర‌త్యేకంగా ఉంద‌ని చెప్పింది. ప‌ర్‌ఫెక్ష‌న్ అనే దాని వ‌ల్ల మ‌నం చాలా కోల్పోవాల్సి ఉంటుంద‌ని.. తాను ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ కాద‌ని.. వ‌రుణ్ మాత్రం చాలా ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ అని చెప్పింది.

ఇక పెళ్ల‌య్యాక సినిమాల విష‌యంలో అత్తింటివారు త‌న‌కు ఎలాంటి కండీష‌న్లు పెట్ట‌లేద‌ని కూడా లావ‌ణ్య తెలిపింది. ఎలాంటి పాత్ర‌లు చేయాలి… ఎలాంటి పాత్ర‌లు చేయ‌కూడ‌దు ? అనే విష‌యాల‌ను అత్తింటోల్లు త‌న‌కు ఎప్పుడూ చెప్ప‌లేద‌ని.. త‌న కెరీర్‌కు అత్తింటి నుంచి ఎప్పుడూ ఫుల్ కోప‌రేష‌న్ ఉంటుంద‌ని.. మంచిక‌థ దొరికితే వ‌రుణ్‌తో క‌లిసి న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని లావ‌ణ్య స్ప‌ష్టం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news