Moviesఆ స్టార్ హీరోయిన్ సిగ‌రెట్‌, మందు లేక‌పోతే సీన్ చేయ‌దా... సెట్‌లోకి...

ఆ స్టార్ హీరోయిన్ సిగ‌రెట్‌, మందు లేక‌పోతే సీన్ చేయ‌దా… సెట్‌లోకి రాదా..!

చాలా మంది హీరోయిన్లు కూడా షూటింగ్‌కు వ‌స్తూనే ఫుల్లుగా మందేసి వ‌స్తుంటార‌న్నది తెలిసిందే. కొంద‌రు హీరోయిన్లు అయితే షూటింగ్‌కు గ్యాప్ వ‌స్తే కేరోవ్యాన్‌లోకి వెళ్లి ఫుల్లుగా మందుకొట్టి మ‌ళ్లీ సీన్ చేయ‌డానికి కూడా వ‌స్తుంటారు. టాలీవుడ్‌లో బాగా పాపుల‌ర్ అయిన కొంద‌రు స్టార్ హీరోయిన్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అయితే ఒక‌ప్పుడు ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌ను త‌న అంద చందాలు, న‌ట‌న‌తో ఒక ఊపేసిన దివంగ‌త దివ్య‌భార‌తి కూడా మందు, సిగ‌రెట్ లేనిదే షూటింగ్ స్పాట్‌లోకి వ‌చ్చేదే కాద‌ని అనేవారు.

దివ్య‌భార‌తి చ‌నిపోయే టైంలో తెలుగులో వ‌రుస‌పెట్టి స్టార్ హీరోల‌తో న‌టిస్తూ సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టి కొన్ని సినిమాలు చేసేందుకు ఒప్పుకుంది కూడా.. ఆ టైంలో ఆమె అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందింది. దివ్య‌భార‌తి ఎంత పెద్ద హీరోతో సినిమా చేస్తున్నా.. ఎంత పెద్ద డైరెక్ట‌ర్ అయినా కూడా ఆమె షూటింగ్ స్పాట్‌లోనే మందు ప‌డందే.. సిగ‌రెట్ పొగ‌లు గుప్పుమ‌నిపించందే స్పాట్‌లోకి ర‌ద‌నే వారు.

డీప్‌గా దివ్య‌భార‌తి క‌ళ్ల‌ను చూస్తేనే ఆమె ఓ పెగ్గు వేసి సెట్‌లోకి వ‌చ్చింద‌ని చాలా మంది చెప్పేవారు. ఇక దివ్య‌భార‌తి హిందీలో సాత్ స‌ముంద‌ర్ అనే సాంగ్‌లో ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ఈ సాంగ్ ఇప్ప‌ట‌కీ ప‌బ్బుల్లో వినిపిస్తూ ఉంటుంది. తెలుగులో అయితే ఆమె రౌడీ అల్లుడు, బొబ్బిలిరాజా, అసెంబ్లీ రౌడీ, ధర్మ క్షేత్రం, చిట్టెమ్మ మొగుడు సినిమాల్లో న‌టించింది. కేవ‌లం 19 సంవ‌త్స‌రాల‌కే ఆమె ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి కింద‌ప‌డి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

ఇక దివ్య‌భార‌తి చ‌నిపోయిన‌ప్పుడు కూడా ఆమె మ‌ద్యం మ‌త్తులో ఉంద‌నే బాలీవుడ్ మీడియా రాసుకు వ‌చ్చింది. మ‌ద్యం మ‌త్తులోనే ఆమె పై నుంచి కింద‌ప‌డిపోయింద‌ని.. కాదు పైన భ‌ర్త‌తో గొడ‌వ జ‌రిగింద‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా ఆమె మ‌ర‌ణంపై ప్ర‌చారం జ‌రిగింది. ఆమె బాలీవుడ్ మేక‌ర్ సాజిద్ న‌డియ‌డ్ వాలాను పెళ్లి చేసుకుని యేడాదిన్న‌రకే అకాల మ‌ర‌ణంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news