Movies"నేను సింగిల్ కాదు".. మెగా అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్ చెప్పిన...

“నేను సింగిల్ కాదు”.. మెగా అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్ చెప్పిన నీహారిక..!

ప్రజెంట్.. నిహారిక పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. కొంతమంది ఆమె పేరుని ట్రోల్ కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక ను ఓ రేంజ్ లో ఏకేసింది సోషల్ మీడియా . అయితే ఇప్పుడిప్పుడే అవి ఎండ్ అయిపోతున్న టైం లో మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తన విడాకులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి .

“పెళ్లి తర్వాత లైఫ్ మనం అనుకున్నట్లు ఉండదు అని.. మనుషులు మారిపోతారు అని ..మనుషులను నమ్మడం తప్పు అని తెలుసుకున్నాను అని.. నిహారిక చెప్పడం పరోక్షకంగా జొన్నలగడ్డ చైతన్య పై నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేసింది”. అయితే దీనిపై జొన్నలగడ్డ చైతన్య కూడా రియాక్ట్ అవ్వడం గమనార్హం . విడాకుల విషయంలో నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి అని .. ఎప్పుడూ ఒకే వైపు జడ్జిమెంట్ తీసుకోకూడదు అని .. కూసింత ఘాటుగానే రెస్పాండ్ అయ్యాడు .

కాగా ఈ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ ..”విడాకులు తీసుకున్న తర్వాత నేను సింగిల్ గా లేను ..నేను మా అమ్మ నాన్నలతో ఉన్నాను ..మా అన్న వదిన ..అమ్మానాన్న నాకు ఎప్పుడు సపోర్టుగా ఉంటారు .నేను సింగల్ గా ఉన్నాను అని అనుకోవడం లేదు. ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నాను.. చాలా సంవత్సరాల తర్వాత సినిమాలు చేస్తున్నాను ..ఓవైపు సినిమాలు కూడా నిర్మిస్తున్నాను ..చాలా బిజీ బిజీగా ఉన్నాను” అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫ్యూచర్లో నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుంది అన్న ఆశలు కూడా అభిమానులకి కొట్టుకుపోయాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news