Moviesవామ్మో..వేణు స్వామీ టోటల్ ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..? స్టార్...

వామ్మో..వేణు స్వామీ టోటల్ ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..? స్టార్ హీరోలు కూడా వేస్ట్..!

వేణుస్వామి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనకంటూ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్నాడు. కొంతమంది పెద్ద వ్యక్తిగా.. ప్రముఖుడుగా ఆయనకు గౌరవిస్తే మరి కొందరు మాత్రం ఆయన ను ట్రోల్ చేస్తూ ఉంటారు. సెలబ్రెటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను నిర్మూహమాటంగా బయటపెట్టేసే వేణు స్వామి.. ప్రభాస్ – నయనతార – సమంత – నాగచైతన్య లాంటి స్టార్ హీరో హీరోయిన్ల జీవితాలకు సంబంధించిన విషయాలను ఎంత ఓపెన్ గా చెప్పేసాడో మనకు తెలిసిందే.

కాగా రీసెంట్గా వేణు స్వామి తన ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ ను బయట పెట్టాడు . ఆయన మాటలు వింటే ఎవ్వరైనా షాక్ అయిపోవాల్సిందే. ఆయన అంత పెద్ద కోటీశ్వరుడా ..? అని ఆశ్చర్యపోతారు . వేణు స్వామి మాట్లాడుతూ..” నాకు జాతకం చెప్పడం ద్వారా మాత్రమే డబ్బులు రావు సినిమా సెలబ్రిటీలు .. రాజకీయ ప్రముఖులు నా దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటారు.. ఇవి కాకుండా నాకు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి”.

“రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తాను.. ఒక వైన్ షాప్..ఒక పబ్.. రేంజ్ రోవర్ కార్.. ఇంకా ఇతర వ్యాపారాలు చాలానే ఉన్నాయి . జ్యోతిష్యం చెప్పే వాడి జాతకం బాగుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగేవారికి నా సంపాదనే సమాధానం.. నా రేంజ్ ఇది అని వేణు స్వామి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు”. అంతేకాదు నాతో పాటు నా భార్య కూడా సంపాదిస్తుంది అని.. ఆమె సంగీతంలో మంచి ప్రావీణ్యురాలు అని చెప్పుకొచ్చారు . ప్రెసెంట్ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news