Moviesజబర్ధస్త్ అవినాష్ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్.. ఎమోషనల్...

జబర్ధస్త్ అవినాష్ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

ఇది నిజంగా ముక్కు అవినాష్ ఫ్యాన్స్ కు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మనకు తెలిసిందే పలు టీవీ షోస్ ద్వారా జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో గేమ్ ఆడి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని.. మరింత రేంజ్ లో ఫేమస్ అయిన అవినాష్ 2021లో అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు .

2023 ఏప్రిల్ లో ప్రెగ్నెన్సీ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా అవినాష్ కన్ఫామ్ చేశారు. అప్పటినుంచి వీళ్ళు తమ ప్రేగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోస్ ని సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూనే వచ్చారు . శ్రీమంతం కూడా చాలా చాలా గ్రాండ్ గా జరిపారు. రీసెంట్ గా అవినాష్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా పెట్టిన పోస్ట్ అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. తన భార్యకు పుట్టిన బిడ్డని కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు అవినాష్ .

ఆ పోస్టులో ఆయన రాసుకొస్తూ..” ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్న.. నేను ఫస్ట్ టైం నా జీవితంలో జరిగిన విషాదాన్ని మీతో పంచుకుంటున్నాను .. మేము అమ్మానాన్న అవ్వాలని ఆ రోజు కోసం ఎంతగా ఎదురుచూసామో మీకు తెలుసు .. కానీ కొన్ని కారణాలవల్ల ఆ బిడ్డను మేము కోల్పోయాము .. ఈ విషయం నేను ఎప్పటికీ జన్మించుకోలేకపోతున్నాను .. అంత త్వరగా మర్చిపోలేనిది కూడా.. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతోనే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను .. దయచేసి ఇక దీనిపై మమ్మల్ని ప్రశ్నలు అడిగి వేధించొద్దు. మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.. మీ అనూజ అవినాష్ “అంటూ రాసుకువచ్చాడు. దీంతో అవినాష్ కి అందరూ ధైర్యం చెబుతున్నారు . దయచేసి ఇటువంటి సమయంలో ఆయనను ఒంటరిగా వదిలేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news