Moviesఈ ఫొటోలో ఉన్న స్పెషాలిటి గమనించారా.. ఆ విషయంలో మాత్రం మెగాస్టార్...

ఈ ఫొటోలో ఉన్న స్పెషాలిటి గమనించారా.. ఆ విషయంలో మాత్రం మెగాస్టార్ వెరీ వెరీ లక్కి ఫెలో..!!

ప్రజెంట్ మెగా ఫ్యామిలీ ఎంత ఆనందంలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల కేవలం మెగా ఫ్యామిలీనే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్.. ఆయన అభిమానులు.. సన్నిహితులు ..స్నేహితులు అందరూ కూడా ఆయనకు విషెస్ అందిస్తున్నారు . ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన మామగారికి స్పెషల్గా విషెస్ అందించింది .

మనవరాళ్లతో కలిసి ఉన్న చిరంజీవి ఫోటోని షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ గా రాస్కొచ్చింది . మీరు చూస్తుంది ఒక శక్తివంతమైన పిడికిలి నుంచి అయిదు వేళ్ళు. సినిమా పరంగానే కాదు ఒక నాన్నగా, ఒక మామగా, ఒక తాతగా మీరు మాకు స్ఫూర్తి. మీకు పద్మ విభూషణ్ వచ్చినందుకు అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఉపాసన షేర్ చేసిన ఫోటో ట్రెండ్ అవుతుంది.

అయితే ఎప్పుడు క్లిం కారా ఫోటో షేర్ చేసిన ఎమోజిస్ పెట్టి ఫేస్ కవర్ చేసే మెగా ఫ్యామిలీ ..ఈసారి మాత్రం జస్ట్ బ్లర్ చేసి ఫోటో సగం కి పైగానే రివీల్ చేసింది . ఫోటోలోని పోలికలు చూస్తుంటే క్లింకార అచ్చం చరణ్ లానే ఉంది అంటున్నారు మెగా అభిమానులు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా సరే మళ్లీ మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో పునర్ వైభవం అందుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news