Moviesఈ తారక్ కూడా మరో మహేశ్ లా తయారు అవుతున్నాడే.. ఏం...

ఈ తారక్ కూడా మరో మహేశ్ లా తయారు అవుతున్నాడే.. ఏం చేశాడో చూడండి..!

సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని అడిగిన అందరు టక్కున చెప్పే పేరు మహేష్ బాబు . సినిమాల కోసం ఎన్ని సార్లు విదేశీ టూర్లకి వెళ్తాడో తెలియదు కానీ కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి మాత్రం సంవత్సరానికి కనీసం నాలుగైదు సార్లు విదేశీ టూర్లకు వెళుతూ ఉంటాడు. ఫ్యామిలీతో చిల్ అవుట్ అవుతూ టైం స్పెండ్ చేయడం మహేష్ బాబుకి చాలా చాలా ఇష్టం.

ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. అందుకే ఆయన విదేశీ టూర్లను పక్కన పెట్టేసాడు. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి వచ్చేసాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రచారం జరుగుతుంది . ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఒకపక్క దేవర మరొకపక్క వార్ 2 సినిమాల బిజీబిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా ఎన్టీఆర్ ఇలా ఫారిన్ టూర్ వెళ్లడంపై చాలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి . అయితే త్వరలోనే రాబోతున్న తన బర్త్డ డేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో ఫారిన్ టూర్ వెళ్లారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈసారి తన బర్త్డడేను మొత్తం టోటల్గా తన ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారట. ఆ కారణంగానే ఎన్టీఆర్ వేరే ఫారిన్ కంట్రీలో ల్యాండ్ అయ్యారట. ఏ కంట్రీ కి వెళ్లారు అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈసారి ఎన్టీఆర్ బర్త్డ డే ట్రీట్ మామూలుగా ఉండదు. దేవర సినిమా అప్డేట్ తో పాటు వార్ 2 స్పెషల్ వీడియో.. అదే విధంగా ఎన్టీఆర్ 31 సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు . అంతేకాదు కొత్తగా కమిట్ అయిన త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా తారక్ బర్తడే నాడే రాబోతుందట..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news