Moviesఅమ్మ బాబోయ్..ఈ మమిత బైజు అప్పుడే డైరెక్టర్లకి..అలాంటి కండీషన్స్ పెడుతుందా..?

అమ్మ బాబోయ్..ఈ మమిత బైజు అప్పుడే డైరెక్టర్లకి..అలాంటి కండీషన్స్ పెడుతుందా..?

మమిత బైజు ..ప్రెసెంట్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేము అంటూ ఉంటారు కదా ..బహుశా మమిత బైజు విషయంలో అదే నిజం అని క్లారిటీ వచ్చింది. ఒకే ఒక్క సినిమాతో తన తలరాతను తానే మార్చుకున్న మమితా బైజు ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషనల్ బ్యూటీ గా మారిపోయింది . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది . మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకోవడం ..ఆమె లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటున్నారు అభిమానులు .

అంతేకాదు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలలో కూడా ఆమె నటించే అవకాశాలు అందుకుంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . నిన్న మొన్నటి వరకు శ్రీ లీల ఉన్న స్థానాన్ని ఇప్పుడు మమిత బైజు లాగేసుకుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే మమిత బైజు ఇప్పటివరకు కొట్టింది ఒకే ఒక్క హిట్ . అయితే అప్పుడే ఆమె తెలుగు డైరెక్టర్లకు కండిషన్ పెడుతుందట . కోటి రూపాయలు ఇస్తే కానీ సినిమాకి సైన్ చేయను అంటూ కండిషన్స్ పెట్టేస్తుందట .

ఇది తెలుసుకున్న తెలుగు జనాలు షాక్ అయిపోతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెత ను నువ్వు కూడా ఫాలో అవుతున్నావా..? మమిత అంటూ కామెంట్స్ పెడుతున్నారు . అఫ్కోర్స్ మమిత బైజు కోటి రూపాయలు డిమాండ్ చేయడంలో తప్పులేదు ..కానీ తెలుగులో బడా బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న మూమెంట్లో కూడా ఆమె ఇలా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ మంచి మంచి ఆఫర్స్ మిస్ చేసుకునే పరిస్థితి వరకు రాకుండా ఉండడమే బెటర్ అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో…??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news