Newsఆ హీరోయిన్‌కు లైఫ్ ఇచ్చేందుకు స‌మంత ఏం చేసిందో తెలుసా...!

ఆ హీరోయిన్‌కు లైఫ్ ఇచ్చేందుకు స‌మంత ఏం చేసిందో తెలుసా…!

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ఓ వైపు నటిగా సినిమాలు చేస్తూ ఇప్పుడు నిర్మాత‌గా స‌రికొత్త అవ‌తారం ఎత్తుతోంది. సినిమాల‌తో పాటు వెబ్‌సీరిస్లు కూడా చేస్తోన్న సామ్‌.. కొత్త టాలెంట్ ఎంక‌రేజ్ చేసే క్ర‌మంలోనే ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేసింది. ఇక మ‌యోసైటీస్ వ్యాధికి గురైన స‌మంత యాక్టింగ్‌కు యేడాది పాటు విరామం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సామ్ త‌న కొత్త బ్యాన‌ర్‌కు ట్రాలాల అని పేరు పెట్టింది. ఇదిలా ఉంటే సామ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో మొద‌టి సినిమాగా బేబీ ఫేమ్ వైష్ణ‌వీ చైత‌న్య‌తో తొలి సినిమా చేసే ఛాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బేబీ మూవీతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది వైష్ణ‌వి చైత‌న్య‌. ఆ త‌ర్వాత ఆమెకు లెక్క‌కు మిక్కిలిగా ఛాన్సులు వ‌స్తాయ‌నుకున్నా అలా జ‌ర‌గ‌లేదు.

త‌న‌మొద‌టి సినిమా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌తోనే ఇప్పుడు ఆమె రెండో సినిమా కూడా చేస్తోంది. అలాగే రామ్ – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి వైష్ణవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ప్ర‌చారం న‌డుస్తోంది. ఇక ఇప్పుడు సామ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో తెర‌కెక్కే సినిమాలో వ‌స్తోన్న ఫ‌స్ట్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైన‌ట్టు టాక్ ?

వైష్ణ‌విలోని క్రేజ్‌, ఆమెకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించే సామ్ తాను నిర్మించే సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చిందంటున్నారు. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. మ‌రి సామ్ సినిమాతో అయినా వైష్ణ‌వి చైత‌న్య లైఫ్ ట‌ర్న్ అవుతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news