Newsత‌న‌ను కాద‌ని చిరు ద‌గ్గ‌ర‌కు పోయిన డైరెక్ట‌ర్ వ‌శిష్ట్‌కు క‌ళ్యాణ్‌రామ్ మార్క్...

త‌న‌ను కాద‌ని చిరు ద‌గ్గ‌ర‌కు పోయిన డైరెక్ట‌ర్ వ‌శిష్ట్‌కు క‌ళ్యాణ్‌రామ్ మార్క్ షాక్‌… బింబిసార 2 డైరెక్ట‌ర్ ఫిక్స్‌..!

క‌ళ్యాణ్‌రామ్ కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే విష‌యంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయ‌న బ్యాన‌ర్ నుంచే ఎంతోమంది కొత్త ద‌ర్శ‌కుల‌తో పాటు ర‌చ‌యిత‌లు, హీరోయిన్లు ప‌రిచ‌యం అయ్యారు. వీరిలో కొంద‌రు టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లుగా కూడా ఉన్నారు. అనిల్ రావిపూడి, సురేంద‌ర్‌రెడ్డి, బింబిసార వ‌శిష్ట్ ఇలా వీళ్లంద‌రూ క‌ళ్యాణ్‌రామ్ ప‌రిచ‌యం చేసిన వారే. చివ‌ర‌కు కాజ‌ల్ కూడా క‌ళ్యాణ్‌రామ్ సినిమాతోనే ప‌రిచ‌యం అయ్యింది. గ‌తేడాది క‌ళ్యాణ్‌రామ్ బింబిసార‌తో త‌న కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా విజ‌యంలో ద‌ర్శ‌కుడి పాత్ర‌ను కొట్టిప‌డేయ‌లేం. రెండో సినిమాతోనే ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. వ‌శిష్ట్ ఇంత పాపుల‌ర్ అవ్వ‌డానికి క‌ళ్యాణ్‌రామ్ ఛాన్స్ ఇవ్వ‌డం వ‌ల్లే. అయితే ఆ కృత‌జ్ఞ‌త వ‌శిష్ట్ తొలి సినిమా హిట్ అయిన వెంట‌నే మ‌ర్చిపోయిన‌ట్టు ఉన్నాడు. ముందునుంచి బింబిసార సీక్వెల్‌గా బింబిసార 2 ఉంటుంద‌ని.. ఆ సినిమా కూడా తానే డైరెక్ట్ చేస్తాన‌ని చెప్పుకుంటూ వ‌చ్చాడు.

ఎప్పుడు అయితే చిరును డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చిందో అప్ప‌టి నుంచే బింబిసార 2ను ప‌క్క‌న పెట్టేశాడు. ఇది క‌ళ్యాణ్‌రామ్‌ను కూడా హ‌ర్ట్ చేసింది. వెంట‌నే క‌ళ్యాణ్‌రామ్ డెవిల్ సినిమాకు క‌మిట్ అయ్యాడు. డెవిల్ ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనే బింబిసార 2పై క‌ళ్యాణ్‌రామ్ క్లారిటీ ఇస్తూ ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ చెంప చెల్లుమ‌నిపించేలా ఆన్స‌ర్ ఇచ్చాడు. వ‌చ్చే యేడాది ఏప్రిల్ నుంచి బింబిసార 2 స్టార్ట్ అవుతుంద‌ని చెప్పేశాడు.

ఇక బింబిసార సినిమాకు వీఎఫ్ఎక్స్ ప‌నులు చూసుకున్న అనిల్ పాడూరి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సీక్వెల్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని స‌మాచారం. అనిలే ప్ర‌స్తుతం బింబిసార 2 స్క్రిప్ట్ పై ఓ టీమ్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వ‌శిష్ట్ చిరు సినిమా ఛాన్స్ రాగానే క‌ళ్యాణ్‌రామ్‌కు హ్యాండ్ ఇచ్చినా క‌ళ్యాణ్‌రామ్ మాత్రం కొత్త ద‌ర్శ‌కుడితో బింబిసార సీక్వెల్‌కు వెళ్లిపోతూ అనిల్‌కే షాక్ ఇచ్చాడంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news