Moviesబిగ్ బ్రేకింగ్: 'యమ పాశం తో ఉయాల ఊగాలి అని సూస్తే.."..ఎన్టీఆర్...

బిగ్ బ్రేకింగ్: ‘యమ పాశం తో ఉయాల ఊగాలి అని సూస్తే..”..ఎన్టీఆర్ “దేవర” నుంచి ఊర నాటు మాస్ డైలాగ్ లీక్ అయిపోయిందోచ్..!

ఇది నిజంగా నందమూరి అభిమానులకు పండగ చేసుకునే న్యూస్ అనే చెప్పాలి . ఆర్ ఆర్ ఆర్ తర్వాత తెర పై కనిపించని ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . ఈ సినిమాని కెరియర్ లో ఫస్ట్ టైం రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు కొరటాల శివ . ఎన్టీఆర్ కెరీర్ లో కూడా రెండు భాగాలుగా తెరకెక్కే సినిమా ఇదే కావడం గమనార్హం . కాగా ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాయి .

త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా ఘనంగా ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా కొత్తగా నాచురల్ లుక్స్ లో కనిపించబోతున్నాడు అంటూ ఫస్ట్ పోస్టర్ ఆధారంగానే తెలిసిపోయింది. అయితే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రెడీ చేశారు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఓ విషయాన్ని లీక్ చేశాడు. ఇలాంటి మూమెంట్లోని ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేసుకునే ఓ డైలాగ్ నెట్టింట వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి తాజాగా ఓ భారీ డైలాగ్ నెట్టింట లీకై అది కాస్త వైరల్ గా మారడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో భారీ డైలాగ్ చెప్పబోతున్నారట. అది కూడా విలన్స్ ని వేటాడి వెంటాడే క్రమంలో ఆయన చాలా పవర్ ఫుల్ గా ..” యమపాశం తో ఉయ్యాల ఊగాలి అని సూస్తే అది మెడకు చుట్టుకుని సావు పరిచయం చేస్తుంది” అంటూ ఊర నాటు మాస్ డైలాగ్ ను ఎన్టీఆర్ తన నోటితో చెప్పబోతున్నాడట . ఈ సినిమాకి సంబంధించిన ఈ డైలాగు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

అంతేకాదు ఎన్టీఆర్ ఇలాంటి మాస్ డైలాగ్ చెప్తే థియేటర్స్ లో విజిల్స్ మారుమ్రోగిపోవాల్సిందే . బాక్స్ ఆఫీస్ బద్ధలు అయి పోవ్వాల్సిందే అంటున్నారు నందమూరి అభిమానులు . అంతేకాదు ఈ సినిమా క్రియేట్ చేసే రికార్డ్స్ చూస్తే ఎవరికైనా తడిసిపోవాల్సిందే అంటూ సినిమాకి భారీ హైప్ ఇచ్చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news