Newsప్రశాంత్ నీల్ తరువాత ఎన్టీఆర్ కమిట్ అయిన డైరెక్టర్ ఎవరో తెలుసా.....

ప్రశాంత్ నీల్ తరువాత ఎన్టీఆర్ కమిట్ అయిన డైరెక్టర్ ఎవరో తెలుసా.. మనకు తెలియకుండానే రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలను చూస్ చేసుకుంటున్నారు. అలా అయితే ఒక సినిమాతో ఐదు భాషలు కవర్ చేయించని క్రేజ్ పాపులారిటీ పెరిగిపోతుంది అని అనుకుంటున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు అందరూ ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కేలా చూసుకుంటున్నారు . రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ..దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది . అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్ . అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు..? ఏ డైరెక్టర్లను లిస్టులో పెట్టాడు..? అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తారక్ టాలెంట్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారట.

ఆయన మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న అట్లీ . ఎస్ అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక క్రేజీ సినిమాకు కమిట్ అయ్యాడట . అంతేకాదు అఫీషియల్ ప్రకటన రానప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ఈ సినిమాకి సంబంధించి వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్నారట . కధ విన్న ఎన్టీఆర్ ఫిదా అయిపోయి ఈ సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా కూడా రాజారాణి టైపులో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ గా ఉండబోతుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news