Newsరామ్ చరణ్ సినిమాలో ఐటెం సాంగ్ మిస్ చేసుకున్న కీర్తి సురేష్.....

రామ్ చరణ్ సినిమాలో ఐటెం సాంగ్ మిస్ చేసుకున్న కీర్తి సురేష్.. ఆ సూపర్ డూపర్ హిట్ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడం చాలా చాలా కామన్ . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడరు . మరి కొంతమంది మాత్రం సినిమా మొత్తం నటిస్తే వచ్చే డబ్బులు కేవలం రెండు నిమిషాల పాటకే వచ్చేస్తున్నాయి అంటూ ఓకే చేస్తారు . కానీ స్టార్ దర్శకుడి డైరెక్షన్లోనే అలా చేయడానికి ఇష్టపడతారు. కోట్లు ఆఫర్ వచ్చినా సరే కీర్తి సురేష్ ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయను అంటూ తెగేసి చెప్పిందట .

ఆ సినిమా మరేదో కాదు “రంగస్థలం”. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమాలో సమంత కి వచ్చిన ఫాన్ ఫాలోయింగ్ కన్నా ఐటమ్ సాంగ్ చేసిన పూజ హెగ్డే కి వచ్చిన ఫ్యాన్ బేస్ ఎక్కువ అని చెప్పాలి . అయితే పూజా హెగ్డే స్థానంలో సుకుమార్ ముందుగా కీర్తి సురేష్ ని అనుకున్నారట .

ట్రెడిషనల్ బ్యూటీగా ఉన్న ఆమె జిగేల్ రాణి సాంగ్ చేస్తే కచ్చితంగా హిట్ కొడుతుంది ..కచ్చితంగా ఇంకా అభిమానులను ఆకట్టుకుంటుంది అంటూ అప్రోచ్ అయ్యారట . కానీ కీర్తి సురేష్ ఐటెం సాంగ్ చేయను అంటూ తెగేసి చెప్పడంతో ఆయన ఈ పాత్రను పూజ హెగ్డే కి ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు సుకుమార్ కి కీర్తి సురేష్ నటన అన్న కూడా చాలా చాలా ఇష్టమట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news