Moviesపెళ్ళి సందD కంటే ముందే శ్రీలీల తెలుగు లో చేయాల్సిన బిగ్...

పెళ్ళి సందD కంటే ముందే శ్రీలీల తెలుగు లో చేయాల్సిన బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా..? దొబ్బేసింది ఆ హీరోయిన్ నే..!!

శ్రీ లీల.. శ్రీ లీల.. శ్రీ లీల ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరే జపిస్తున్నారు జనాలు . సినిమా స్టార్ హీరో కాదు.. సీనియర్ హీరో కాదు.. కమెడియన్ కాదు.. డైరెక్టర్ కాదు ఎవరైనా సరే శ్రీలీల పేరే ఎక్కువగా జపిస్తున్నారు . దానికి కారణం ఆమెకున్న అందం ఒకటి అయితే ఆమెకున్న మంచితనం మరొకటి అని చెప్పాలి . కాగా రీసెంట్ గా హీరోయిన్ శ్రీ లీల భగవంత్ కేసరి ,ఎక్స్ట్రాడినరీ మ్యాన్ , ఆదికేశవ సినిమాలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .

ఆది కేశవ , ఎక్స్ట్రాడినరీ ఆశించినంత స్థాయి కలెక్షన్స్ రాబట్టకపోయినా శ్రీ లీల పర్ఫామెన్స్ కు మంచి మార్కులు దక్కించుకుంది . ఇలాంటి క్రమంలోని శ్రీ లీల పెళ్లి సందడి సినిమా కంటే ముందే ఇండస్ట్రీలో హీరోయిన్గా మరో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉండాల్సింది అన్న వార్త వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు “ఛలో”.

నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాలో శ్రీ లీల ను హీరోయిన్గా అనుకున్నారట మేకర్స్ . అయితే ఆమె చదువులో బిజీగా ఉండడం అదే సమయానికి ఎగ్జామ్స్ ఉండడం ఆమె ఈ ఆఫర్ చేయనికుండా చేసింది .ఆ తర్వాత ఈ లక్కీ ఛాన్స్ ను కన్నడ పిల్ల రష్మిక అందుకునింది . ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది .యానిమల్ సినిమాతో ఓ రేంజ్ లో ఊపు ఊపేసింది రష్మిక.

ప్రజెంట్ శ్రీలీల చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. అందులో దాదాపు నాలుగు సినిమాలు మినహా అన్ని సినిమాలు హిట్ అయ్యేవే కావడం గమనార్హం. అంతేకాదు త్వరలోనే శ్రీలీల ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పబోతుందట. బాగా టైడ్ అయిపోయిన కారణంగా ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదట. రెస్ట్ తీసుకోబోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news