Moviesబిగ్ బ్రేకింగ్: మరి కొన్ని గంటల్లో సలార్ రిలీజ్.. అభిమానులు ఎగిరి...

బిగ్ బ్రేకింగ్: మరి కొన్ని గంటల్లో సలార్ రిలీజ్.. అభిమానులు ఎగిరి గంత్తేసే బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..!!

అద్గది అలా ఉండాలి ప్రభాస్ క్రేజ్ రేంజ్ అంటే.. కొద్దిగంటలు కేవలం మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . బాహుబలి లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయిన ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా సలార్. కేజిఎఫ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది .

డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఫస్ట్ ట్రైలర్ అటు ఇటుగా ఉన్న సెకండ్ ట్రైలర్ మాత్రం దుమ్ము దులిపి పడేసింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్ లో కూడా మోత మోగించేస్తున్నారు రెబెల్ ఫాన్స్. ఇప్పటికే టికెట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద క్యూ కట్టి హంగామా చేస్తున్నారు . కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో సల్లార్ కి సంబంధించిన ఓ న్యూస్ వైఅర్ల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క కూడా ఉంది అంటూ ఓ సరికొత్త న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. సినిమా మరికొద్ది గంటలో రిలీజ్ అవుతుంది అనగా ఈ న్యూస్ ప్రచారం జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కి వచ్చే ముందు అనుష్క ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని ఓ డైలాగ్ ని యాడ్ చేశారట ప్రశాంత్ నీల్.

అంతేకాదు ఆ సీన్ కి సెట్ అయ్యే విధంగా ప్రభాస్ అనుష్కల మిర్చి సీన్స్ ను క్రాప్ చేసి ఇక్కడ అమర్చారట. అంతేకాదు థియేటర్స్ లో ఈ సీన్స్ చూసిన ప్రతి ఒక్కరికి గూస్బంస్ మోత మోగాల్సిందే అంటున్నారు మేకర్స్ . అంతేకాదు కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ చేసే రికార్డ్స్ కలెక్ట్ చేస్తుందని అంటున్నారు . మరికొందరు ఈ సినిమా ద్వారా అనఫిషియల్ గానే తన పెళ్లి వార్తను బయట పెట్టబోతున్నాడు ప్రభాస్ అంటూ ఆనందపడుతున్నారు . చూద్దాం మరి ఇది కేవలం రూమర్ ఏనా ..? నిజంగానే అనుష్క శెట్టి సెలార్ సినిమాలో ఉందా ..? అన్నది తెలియాలి అంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news