Moviesప్రభాస్ క‌ల్కి సినిమాకు ఫ‌స్ట్ అనుకున్న హీరో ఎవ‌రంటే... అంత సీన్...

ప్రభాస్ క‌ల్కి సినిమాకు ఫ‌స్ట్ అనుకున్న హీరో ఎవ‌రంటే… అంత సీన్ లేద‌ని నాగ్ అశ్విన్ తీసిప‌డేశాడా..!

నేషనల్ హీరో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు కేవలం టాలీవుడ్, సౌత్ ఇండియా మాత్రమే కాదు దేశం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది. ప్రభాస్ అంత గొప్ప హీరో అయిపోయాడు. తాజాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఈనెల 22న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర డైనోసార్ గా గర్జించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే సలార్ ప్రకంపనలు వేడి మొదలైపోయింది. సలార్ తర్వాత ప్రభాస్.. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న కల్కి సినిమాపై కూడా ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. సినిమాపై అంచనాలను ఆకాశాన్ని దాటి ఇంకా పైకి తీసుకు వెళ్లిందని చెప్పాలి. ఈ సినిమాలో త‌మిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుంటే.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపిక పదుకొనే, దిశాపటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లు అని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత చలసాని అశ్వినీదత్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది మే 9న పాన్ ఇండియా రేంజ్‌లోను.. అటు హాలీవుడ్ లోనూ రిలీజ్ చేసేలా ప్లానింగ్ అయితే జరుగుతుంది. కచ్చితంగా ఈ సినిమాతో నాగ్ అశ్విన్, ప్రభాస్ ఇద్దరు ఏదో ఒక అద్భుతమైన మాయ క్రియేట్ చేయబోతున్నారు అన్న ఉత్సుక‌త అయితే అందరిలోనూ ఉంది. వాస్తవంగా నాగ్ ఈ కథ రెడీ చేశాక నిర్మాత అశ్వినీద‌త్‌ చిరంజీవితో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారట. మహానటి సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆ సినిమా టీంను పిలిపించుకుని అభినందించిన చిరంజీవి.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ఒక సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. ముందు నాగ్ అశ్విన్ కూడా చిరంజీవితో ఈ ప్రాజెక్టు చేయాలని ఉత్సాహపడ్డాడు.

అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస డిజాస్టర్లు, రీమేక్‌ సినిమాలతో మార్కెట్ తగ్గిపోవడంతో తన రేంజ్‌కు చిరంజీవి సరిపోడని డిసైడ్ అయ్యి.. పాన్ ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న ప్రభాస్‌తో ఈ సినిమాను చేయాలని ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించినట్టు తెలుస్తోంది. అందుకే ముందు వైజయంతీ, నాగ్ అశ్విన్, చిరంజీవి కాంబినేషన్లో అనుకున్న సినిమా కాస్త ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయింది. ఏది ఏమైనా రూ.600 కోట్ల బడ్జెట్ అంటే చిరంజీవి మీద చాలా పెద్ద రిస్క్. అసలు ఇప్పుడు మైత్రి వాళ్ళు తీస్తున్న డిసెంబర్ కు రూ.150 కోట్ల బడ్జెట్ అంటేనే ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో తెలియని పరిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news