Moviesప్రభాస్ జాతకం ఇంత దరిద్రంగా ఉందేంటి..సలార్ హిట్ కొట్టిన ఆ ఆనందమే...

ప్రభాస్ జాతకం ఇంత దరిద్రంగా ఉందేంటి..సలార్ హిట్ కొట్టిన ఆ ఆనందమే లేకుండా చేశారుగా..!

ప్రభాస్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. రెబెల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో మొదటి సినిమా నుంచి నిన్న కాక మొన్న రిలీజ్ అయిన సలార్ సినిమా వరకు సినిమా సినిమాకి తన నటన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే వచ్చాడు . ప్రభాస్ తాజాగా నటించిన సినిమా సలార్. ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ ని నమోదు చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుంది .

అయితే ఎంత భారీ కలెక్షన్స్ సాధించిన సలార్ సినిమా మాత్రం ఓ విషయంలో అభిమానులను హర్ట్ చేసింది . ఓ కీలకమైన రికార్డు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . అదే నైజం ఓపెనింగ్ రికార్డ్. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ నైజాంలో బిగ్ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పటివరకు నైజాంలో బిగ్గెస్ట్ రికార్డ్ ఓపెనర్ అంటే ఆర్.ఆర్.ఆర్. రాంచరణ్ – ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా మొదటిరోజు ఏకంగా 23.35 కోట్ల రూపాయలు షేర్ దక్కించుకుంది .

అయితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిన సలార్ మాత్రం ఆ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది . మొదటి రోజు ఈ సినిమాకు నైజాంలో 22.5 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. ఇలా 80 లక్షల తేడాతో క్రేజీ రికార్డును మిస్ చేసుకున్నాడు ప్రభాస్ . పక్కన ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా సరే నైజాం రికార్డ్ బద్దలు కొడితే వచ్చే కిక్కే వేరు . అలాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు ప్రభాస్ అంటూ కొందరు జనాలు గుచ్చి గుచ్చి బాధపడుతున్నారు . దీంతో రెబల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కేవలం నైజామేనా..? ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడు ప్రభాస్.. ఎందుకు ప్రభాస్ ని ఇలా ట్రోల్ చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు . సలార్ సినిమా సక్సెస్ అయినా ఎంజాయ్ చేయనివ్వలేకపోతున్నారే అంటూ కూసింత ఘాటుగానే మాట్లాడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news