Moviesచరిత్రను తిరగరాసిన ప్రభాస్.. సినీ ఇండస్ట్రీ కనీ విని ఎరుగని రికార్డ్.....

చరిత్రను తిరగరాసిన ప్రభాస్.. సినీ ఇండస్ట్రీ కనీ విని ఎరుగని రికార్డ్.. మీసం తిప్పండ్రా రెబల్ ఫ్యాన్స్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా “సలార్” . కే జి ఎఫ్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ చాలా టైం గ్యాప్ తీసుకొని తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం. శృతిహాసన్ హీరోయిన్గా ..జగపతిబాబు – పృధ్విరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది.

ఫుల్ టు ఫుల్ ప్రభాస్ ని ఈ సినిమాలో చాలా కాలం తర్వాత మనం మాస్ లుక్ లో చూడొచ్చు . అంతేకాదు ప్రభాస్ యాక్షన్ సీన్స్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా మారిపోయాయి . ఈ సినిమా ఏకంగా మొదటి రోజే 177 కోట్లు కలెక్ట్ చేసి సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసింది . అయితే ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఓరేర్ రికార్డును అచీవ్ చేశాడు . ఈ సంవత్సరంలో ప్రభాస్ నటించిన “ఆది పురుష్” సినిమా కూడా రిలీజ్ అయింది .

ఆ సినిమా మొదటి రోజే వందకోట్లను దాటేసింది . అలాగే రెండోసారి రిలీజ్ అయిన సలార్ సినిమా కూడా 177 కోట్లు దాటేసింది . దీంతో ఒకే సంవత్సరం ఒకే హీరో నటించిన రెండు సినిమాలు 100 కోట్లు క్రాస్ చేయడం బిగ్ రికార్డుగా మారిపోయింది . ఇంతవరకు ఇలాంటి రేర్ రికార్డ్ ఈ జనరేషన్ హీరోలు ఎవరు సాధించలేదు . దీంతో ప్రభాస్ పేరు మరోసారి మారుమ్రోగిగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news