Moviesమెగా ఫ్యామిలీతో గొడవ ..ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన అల్లు...

మెగా ఫ్యామిలీతో గొడవ ..ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన అల్లు అర్జున్.. బంధం ముగిసిపోయినట్లేనా..?

ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో ..వైరల్ అవుతుందో ..ట్రోలింగ్ కి గురవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ పెట్టడం జనసేన ఫ్యాన్స్ ని కి హ్యాపీనెస్ తెప్పించిన .. ఆ తర్వాత వెంటనే వైసిపి క్యాండిడేట్ శిల్ప రవికి సపోర్ట్ చేస్తూ నంద్యాలకు వెళ్లి ప్రచారం చేయడం బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

దీనితో సోషల్ మీడియాలో బన్నీ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు అభిమానులు . కాగా రీసెంట్గా నాగబాబు సైతం బన్నీని టార్గెట్ చేస్తూ ఘాతు ట్వీట్ చేశారు..అప్పుడు బన్నీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఆ తర్వాత బన్నీ కూడా నాగబాబుకు ఘాటు కౌంటర్ ఇచ్చారు . ఇలా సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ మధ్య వార్ మరింత ముదిరిపోయింది. అయితే మెగాస్టార్ చిరంజీవి కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఈ ఇష్యూపై ఏ విధంగా స్పందించకపోవడంతో ఫ్యాన్స్ కూడా మరింత స్థాయిలో రెచ్చిపోయారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీతో ఉన్న గొడవలు కారణంగా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్లో ఉండే గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారట . మెగా ఫ్యామిలీ హీరోలు అందరికీ కలిపి ఒక గ్రూప్ ఉందట .ఏ అప్డేట్స్ వచ్చిన ఏ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా ఆ గ్రూప్లోనే మాట్లాడుకుంటారట . తాజాగా అల్లు అర్జున్ ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news