Moviesప్రభాస్ ‘బుజ్జి’ని చూశారా. అన్ని ఉన్న అదే బిగ్ మైనస్ గా...

ప్రభాస్ ‘బుజ్జి’ని చూశారా. అన్ని ఉన్న అదే బిగ్ మైనస్ గా మారిందే(వీడియో)..!

మొత్తానికి ప్రభాస్ తన లైఫ్ లో రాబోతున్న స్పెషల్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేసేశారు. అయితే అందరూ అనుకున్నట్టు అది ఆయన పెళ్లికి సంబంధించిన వార్త కాదు .. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెట్టిన పోస్ట్ అంటూ క్లారిటీ వచ్చేసింది . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో హీరోగా ప్రభాస్ దిశా పటాన్ని – దీపికా పదుకొనే హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్.. పోస్టర్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది .

తాజాగా స్క్రాచ్ వీడియో పేరిట నాగ్ అశ్వీన్ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. కాగా రీసెంట్గా ప్రభాస్ తన లైఫ్ లో స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు . ఆ స్పెషల్ పర్సన్ వారెవరో కాదు బుజ్జి. బుజ్జి అంటే ఏంటి..? అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది . మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో..? బుజ్జిని కూడా ఓ బ్రెయిన్ అలాగే కంట్రోల్ చేస్తుంది. అదే ఈ సినిమాకి కీలకంగా మారిపోతుంది .

బుజ్జి మాట్లాడుతూ సచ్చినోడా అంటూ తిట్లు కూడా తిడుతుంది . బుజ్జిని తయారు చేసిన వారిని ఈ వీడియోలో కూడా చూపించారు . అంతేకాదు బుజ్జి అంటే వాహనం మాత్రమే అనుకునేరు కాదు ఇది సూపర్ హీరో అని కూడా చెప్పొచ్చు . హైలైట్ ఏంటంటే బుజ్జి పాత్రకు గాత్రం చెప్పింది కీర్తి సురేష్. కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఈ బుజ్జి పాత్రకు హైలైట్ గా మారింది. కాగా మొదటి నుంచి ఈ సినిమాకి కర్త – కర్మ – క్రియ అంతా కూడా ప్రభాస్ అని ఓ రేంజ్ లో ఈ సినిమాని అల్లాడించబోతున్నాడు అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు .

అఫ్ కోర్స్ సినిమా కథపరంగా సినిమా ఎలివేషన్స్ పరంగా ప్రభాస్ అంతా బాగానే ఉన్నప్పటికీ మధ్యలో ఈ బుజ్జి క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేయడంతో ఇప్పుడు ఫోకస్ అంతా బుజ్జి పైన పడింది . సినిమాలో ప్రధానంగా ఈ బుజ్జిని కనిపించబోతుంది అని.. సినిమాకి మొదటి హీరో ప్రభాస్ అయితే రెండవ హీరో బుజ్జి అంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన ఈ బుజ్జి కోసం ఏం చేయబోతున్నారు ..? అనేది హైలేట్ గా మారింది. కాగా ప్రెసెంట్ స్క్రాచ్ పేరిట నాగ్ అశ్వీన్ రిలీజ్ చేస్తున్న ఒక్కొక్క అప్డేట్ ..నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news