Movies' స‌లార్ ' అట్ట‌ర్‌ప్లాప్‌... డిజాస్ట‌ర్‌... ప్ర‌భాస్‌కు న‌టనేరాదు... విషం చిమ్ముతోందెవ‌రు....!

‘ స‌లార్ ‘ అట్ట‌ర్‌ప్లాప్‌… డిజాస్ట‌ర్‌… ప్ర‌భాస్‌కు న‌టనేరాదు… విషం చిమ్ముతోందెవ‌రు….!

సలార్ సినిమాకు అదిరిపోయే టాక్‌ వచ్చింది. దేశం మొత్తం సలార్ ఫీవర్ తో ఊగిపోతుంది. అయితే సలార్ సక్సెస్ చూసి బాలీవుడ్ జనాలు షారుఖ్ ఖాన్, అభిమానులు అసూయ పడుతున్నారు. సలార్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ తరుణంలోనే బాలీవుడ్ సినీ అభిమానులు బాలీవుడ్ మీడియా ప్రభాస్ మీద.. సలార్ సినిమాపై.. విషం చిమ్మ‌డం మొదలు పెట్టేశారు. సోష‌ల్‌ మీడియా ఓపెన్ చేస్తే చాలు సలార్ ప్లాప్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.180 కోట్ల వసూళ్లు రాబట్టింది.

అదే షారుక్ ఖాన్ సినిమా కేవలం రూ.55 కోట్ల వసూళ్లు రాబట్టింది. సలార్ ప్రీమియర్ షో టికెట్లు రూ.2, 3 వేలు పెట్టి కొన్న అభిమానులు ఉన్నారు. అటు ఢంకీ సినిమాకు రెండో రోజే ఏకంగా 50% ఆక్యుపెన్సి పడిపోయింది. సలార్ దెబ్బతో వాళ్లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. అయితే బాలీవుడ్ జనాల్లో కొందరు మాత్రం సలార్ ప్లాప్ అంటున్నారు. కొన్ని మీడియా సంస్థల సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా సలార్ ఫ్లాప్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ప్రభాస్ కంటే డెడ్ బాడీ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందని.. ఓ వీడియోలో ఇద్దరు షారుఖ్ అభిమానులు కామెంట్లు చేశారు. దేవా పాత్రను చూడటం.. కామెంట్ చేసే హిందీ జనాలకు రాదని అనుకోవాలి అంటూ ప్రభాస్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. బాలీవుడ్‌లో కొందరు సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలలో కూడా.. షారుక్ ఖాన్‌ను చూసి ప్రభాస్ యాక్టింగ్ నేర్చుకోవాలన్న కామెంట్లు కనిపిస్తున్నాయి.

బాలీవుడ్ వీడియో క్రిటిక్ ఒకరు సలార్ మూడు గంటల టార్చర్ అంటూ కామెంట్ చేశాడు. సలార్ ప్లాప్ షో అని ఢంకీ బ్లాక్ బ‌స్టర్ అని పోస్టులు పెట్టుకుంటూ.. వాళ్ళు శున‌కానందం పొందుతున్నారు. షారుక్ ఖాన్ పిఆర్ ఈ పోస్టులు చేస్తుందంటూ.. ప్రభాస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా సలార్ వసూళ్ల దెబ్బతో బాలీవుడ్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినట్టే కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news