Movies"కళ్లు దొబ్బాయా ఏంటి రా..?".. తెలుగు హీరోల పై ప్రభాస్ ఫ్యాన్స్...

“కళ్లు దొబ్బాయా ఏంటి రా..?”.. తెలుగు హీరోల పై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్.. ఏమైందంటే..?

సలార్ ..ప్రభాస్ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మూవీ . అంతకుముందు ప్రభాస్ ఎన్ని సినిమాల్లో నటించిన ప్రభాస్ కి ఈ సినిమా చాలా ప్రత్యేకం అనే చెప్పాలి . బాహుబలి లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తరువాత ఒక్క హిట్ లేకుండా చాలా కష్టాలు పడ్డాడు ప్రభాస్ . సాహో -రాధే శ్యామ్- ఆది పురుష్.. లాంటి బిగ్ సినిమాలు వచ్చినా కూడా ఆయనకు హిట్ సక్సెస్ ఇవ్వలేకపోయాయి . సలార్ సినిమా ఆ లోటును తీర్చేసింది.

కలెక్షన్స్ పరంగా కూడా నాలుగు రోజుల్లోనే 500 కోట్లు దాటేసి సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి పలువురు స్టార్స్ రివ్యూలు ఇస్తున్నారు. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు . ప్రభాస్ అంటే జాన్ జిగిడి దోస్తులుగా ఉండే హీరోలు కూడా ఆయన సినిమాపై కనీసం బాగుంది అంటూ ట్వీట్ కూడా చేయలేదు. దీంతో రెబల్ ఫ్యాన్స్ మూడు రోజులు చూసి నాలుగో రోజు మండిపడ్డారు .

మిగతా సినిమాల విషయంలో డప్పు కొట్టుకొని ఆ హీరోలకు మా సలార్ సినిమా కనిపించలేదా..? ఎందుకని ప్రభాస్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అంటూ మండిపడుతున్నారు . కొంతమంది ఫ్యాన్స్ కళ్ళు దొబ్బాయా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. “సలార్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేయకుండా ప్రభాస్ ఫ్యాన్స్ మిగతా హీరోలపై మండిపడడం ఎంతవరకు సమంజసం అంటున్నారు జనాలు”. అయితే రెబల్ ఫ్యాన్స్ కోపంలోనూ రీజన్ ఉంది అని చిన్నచితక సినిమాలకు కూడా ట్వీట్ చేసే హీరోలు పెద్ద సినిమా పైగా ప్రభాస్ సినిమా హిట్ అయిన పట్టించుకోకపోవడం మరింత బాధ పెడుతుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news