Moviesప్ర‌భాస్ హెల్త్‌కు ఏమైంది... ఈ సందేహాల‌కు ఆన్స‌ర్లు ఏవి.. ఏదో తేడా...

ప్ర‌భాస్ హెల్త్‌కు ఏమైంది… ఈ సందేహాల‌కు ఆన్స‌ర్లు ఏవి.. ఏదో తేడా కొడుతోంది…!

ప్రభాస్ సలార్‌ సినిమా దుమ్ము రేపుతుంది. రూ.500 కోట్ల వసూళ్లకు చేరువ అయినా ఈ సినిమా లాంగ్ రన్ లో మంచినీళ్లు తాగినంత సులువుగా వెయ్యి కోట్లు దాటేయనుంది. అయితే ఇంత బ్లాక్ బాస్ట‌ర్‌ వస్తే ప్రభాస్ జాడ ఎక్కడ..? సక్సెస్‌మీట్‌ల‌ దాకా ఎందుకు అసలు ప్రభాస్ కుటుంబం నుంచి… చివరకు తన నుంచి కూడా చిన్న రిప్లై కూడా లేదు. చాలామంది సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు. వాళ్లకు ధన్యవాదాలు కూడా చెప్పటం లేదు. అసలు సలార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు ప్రెస్‌మీట్లు కూడా లేవు.

ఇంత గొప్ప విజయంతో అభిమానులతో పాటు టాలీవుడ్ దేశం మొత్తం గొప్పగా పొగుడుతుంటే.. ప్రభాస్ జాడ లేకపోవడం ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు సినిమా అభిమానులను కూడా కలవరపెడుతోంది. ఒకసారి గతంలోకి వెళితే ఆదిపురుష్ ప్రి రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ప్రభాస్ స్టేజ్ కూడా ఎక్కలేక‌పోయాడు. ప్రత్యేకంగా అప్పటికప్పుడు చిన్న లిఫ్ట్ పెట్టారు. చివరకు ప్రభాస్ హీరోయిన్ కృతిసనన్‌, దర్శకుడు ఓంరౌత్ సాయం తీసుకుని కష్టం మీద నడుస్తున్న వీడియోలు కూడా అప్పట్లో చాలా కనిపించాయి. అప్పట్లోనే అసలు ప్రభాస్‌కు ఏమైంది అనే వార్తలు చాలా వచ్చాయి.

బాహుబలి సమయంలో మోకాలికి ఏదో గాయం అయిందని.. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక అతడు ఫిట్నెస్ లో చాలా తేడా వచ్చిందని.. మోకాలికి పెద్ద సర్జరీ అవసరం అని ప్రచారం జరిగింది. బాహుబలి అయిపోయాక సాహో, రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌ పూర్తయ్యాయి. ఈ మూడు పెద్ద ప్రాజెక్టులే. ఆదిపురుష్‌ సినిమా టైంలోనూ ప్రభాస్ ఆరోగ్యంపై చాలా ప్రచారం జరిగింది. ఇప్పుడు సలార్ విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రభాస్ చాలా బాగా కష్టపడ్డాడని టాక్. సెప్టెంబర్ 9న ప్రభాస్ ఇటలీలో ఓ క్లిష్టమైన సర్జరీ చేయించుకున్నాడని.. నవంబర్ 19న ఇండియాకు తిరిగి వచ్చాడని.. నేషనల్ మీడియాలో సైతం వార్తలు కనిపించాయి.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. మంచు వారి కన్నప్పలో శివుడుగా నటించాలి. మారుతి రాజా డీలక్స్ సినిమా ఉంది. అందులోను కల్కి చాలా పెద్ద ప్రాజెక్ట్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్.. అశ్వినీద‌త్‌ వాళ్ళ సినిమా ఇది.. నాగ్ అశ్విన్ దర్శకుడు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉంది. ఇవన్నీ షూటింగు జరగటం లేదు. ప్రభాస్ అనారోగ్యం.. హాస్పిటాలిటీ వ‌ల్లే ఈ సినిమాల షూటింగ్ లేట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి మీద తన టీం.. ఏదైనా ఒక చిన్న క్లారిటీ ఇస్తే తను జనంలోకి వచ్చి కనిపిస్తే ఫ్యాన్స్ కు పిచ్చ హ్యాపీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news