Moviesపల్లవి ప్రశాంత్ పై కోపంతో ఊగిపోయిన నాగార్జున .. అక్కినేని దెబ్బ...

పల్లవి ప్రశాంత్ పై కోపంతో ఊగిపోయిన నాగార్జున .. అక్కినేని దెబ్బ అంటే ఏంటో చూపించాడుగా..!?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత వైలెంట్గా ఫినిష్ చేసుకుందో తెలిసిందే. అన్ని సీజన్ లు వేరు బిగ్ బాస్ సీజన్ సెవెన్ వేరు. అన్ని సీజన్ లో హౌస్ లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ కొట్టుకుంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా కంటెస్టెంట్స్ కొట్టుకొని చస్తున్నారు. పర్సనల్ విషయాలను ట్రోల్ చేసుకుంటున్నారు .

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన హంగామా కారణంగా ఆయన పేరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది . పోలీస్ రూల్స్ ని బ్రేక్ చేశారన్న కారణంతో పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . రీసెంట్ గానే బెయిల్ పై బయటకు వచ్చారు . అయితే ఈ విషయం ఇక్కడితో ఆగలేదు . ఇప్పుడు ఈ ఇష్యూలోకి నాగార్జున కూడా ఇన్వాల్వ్ అయ్యాడు.

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇంత వీరంగం సృష్టిస్తుంటే నాగార్జున ఎలా సైలెంట్ గా ఉన్నాడు అని మిగతా కంటెస్టెంట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు నాగార్జున ఫ్యాన్స్ కూడా పల్లవి ప్రశాంత్ ఇష్యుపై స్పందిస్తున్నారు . నాగార్జున ఇక బిగ్ బాస్ కి హోస్టుగా చేయకపోవడమే బెటర్ అని .. లేకపోతే ఇలాంటి తలనొప్పులు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుందని సలహా ఇస్తున్నారు. అంతేకాదు నాగార్జున కూడా పల్లవి ప్రశాంత్ పై కోపంగా ఉన్నారట. ఇక దీనిపై ఇన్వాల్వ్ కాదల్చుకోవట్లేదట. బిగ్ బాస్ కి పూర్తిగా బై బై చెప్పే ఆలోచనలోనే ఉన్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news