Moviesఆ బ్లాక్ బస్టర్ సినిమా లో నటించినందుకు .. బన్నీకి ఒక్క...

ఆ బ్లాక్ బస్టర్ సినిమా లో నటించినందుకు .. బన్నీకి ఒక్క రూపాయి కూడా పారితోషకం ఇవ్వలేదా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ కు ఆ సూపర్ డూపర్ హిట్ మూవీలో నటించినందుకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదా..? డైరెక్టర్ చీట్ చేశాడా అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే ఆయన మరెవరో కాదు ఆయన తండ్రి అల్లు అరవింద్ .

వినడానికి నవ్వుకున్నా సరే ఇదే విషయాన్ని అల్లు అర్జున్ స్వయానా పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయం అందరికీ తెలుసు . గంగోత్రి సినిమా కన్నా ముందే బన్నీ నటించిన సినిమా డాడీ . అయితే డాడీ కన్నా ముందుగానే ఒక సినిమాలో నటించాడు బన్నీ ఆ సినిమా మరేదో కాదు చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విజేత .

1985లో తెరకెక్కిన విజేత సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది . ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సీన్ లో కనిపిస్తారు. చిరంజీవి సిస్టర్ కొడుకుగా అల్లు అర్జున్ కనిపించి మెప్పిస్తాడు. ఆ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. ఆ మూవీ 100 డేస్ షీల్ట్ అల్లు అర్జున్ తన ఇన్స్టాల్ లో షేర్ చేస్తూ..” నా మొదటి సినిమా విజేత నా ప్రొడ్యూసర్ మా నాన్న .. ఇన్నాళ్ల తర్వాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నాకు ఈ సినిమాలో నటించినందుకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు “అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. ప్రజెంట్ ఇదే పోస్ట్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news