Newsచిరంజీవి, నాగార్జున ఇద్ద‌రికీ ఆ హీరోయినే కావాల‌ట‌... పాపం ఎన్ని క‌ష్టాల్రా...

చిరంజీవి, నాగార్జున ఇద్ద‌రికీ ఆ హీరోయినే కావాల‌ట‌… పాపం ఎన్ని క‌ష్టాల్రా బాబు…!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తన కెరీర్‌లో 156వ‌ సినిమాలో నటిస్తున్నారు. విశ్వంభ‌ర అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంట‌సీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. బింబిసార తర్వాత దర్శకుడు వశిష్ఠ‌ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ సినిమాలో ముగ్గురు, నలుగురు హీరోయిన్లు ఉంటారు అంటూ ప్రచారం జరుగుతున్నా.. మెయిన్ హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ త్రిష కనిపిస్తారని సమాచారం. గతంలో చిరంజీవి – త్రిష కాంబినేషన్లో స్టాలిన్ సినిమా వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇటు చిరంజీవి కొత్త సినిమాలో ఆయనకు జోడిగా నటిస్తున్న త్రిష.. మరో సీనియర్ హీరో నాగార్జున హీరోగా రూపొందిన లవ్, యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్ లోను నాగార్జునకు జోడిగా నటిస్తుందని తెలుస్తోంది. ఆమెని హీరోయిన్గా ఈ సినిమా మేకర్స్ ఎంపిక చేశారట.

గతంలో నాగర్జున – త్రిష కాంబినేషన్లో శ్రీ‌ను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కింగ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక త్రిష విషయానికి వస్తే ఇటీవల విజయ్‌కి జోడిగా నటించిన లియో సినిమా మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్‌ వచ్చింది. అలాగే తమిళంలో త‌ల‌ అజిత్ కుమార్.. విడమయూర్చీ సినిమాలోను ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఏది ఏమైనా ముదురు ముద్దుగుమ్మ త్రిష ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలకు.. హీరోయిన్లు లేక కష్టాలు పడుతుంటే మంచి ఆప్షన్ గా మారిందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news