Newsప‌వ‌న్ ' OG ' సినిమాకు బాల‌య్య‌కు లింక్ ఏంటి.. సుజీత్...

ప‌వ‌న్ ‘ OG ‘ సినిమాకు బాల‌య్య‌కు లింక్ ఏంటి.. సుజీత్ ట్విస్టులు మామూలుగా లేవే…!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ. దే కాల్ హిమ్ ఓజీ. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో పాటు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, ఓజీ సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఈ మూడు సినిమాల్లో ఓజీపైనే భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ప‌వ‌న్ ను ద‌ర్శ‌కుడు సుజీత్ చాలా స్టైలీష్‌గా చూపిస్తున్నాడ‌న్న అంచ‌నాలు అయితే ప‌వ‌న్ అభిమానుల్లో మామూలుగా లేవు. సాహో త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌రీ సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. అయితే ఈ సినిమాకు బాల‌య్య‌కు లింక్ ఉంది.. అంటే ఈ సినిమాలో బాల‌య్య న‌టించ‌డం లేదు… అలా అనీ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం… లేదా బాల‌య్య సీన్లు వాడుకోవ‌డం లాంటివి ఏవీ లేవు.

ప‌వ‌న్ ఎలివేష‌న్లు బాల‌య్య మాస్ సినిమాల రేంజ్‌లో ఉండ‌బోతున్నాయ‌ట‌. కొన్ని సీన్ల‌లో ప‌వ‌న్ క‌త్తిప‌ట్టి ఉరుకుతూ విల‌న్ల‌ను వెంటాడుతాడ‌ట‌. ఇవి బాల‌య్య గ‌త యాక్ష‌న్‌, ఫ్యాక్ష‌న్ సినిమాల సీన్ల స్టైల్లో ఉంటాయ‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతోంది. క్లాస్, డిఫ‌రెంట్ యాక్ష‌న్‌తో సినిమాలు తీసే సుజీత్ ఈ సారి ప‌వ‌న్‌ను మాస్‌గా చూపించ‌బోతున్నాడ‌ని.. సినిమాలో ప‌వ‌న్‌పై వ‌చ్చే ఎలివేష‌న్లు మామూలుగా ఉండ‌వ‌ని తెలుస్తోంది.

మ‌రి ప‌వ‌న్ అరివీర భ‌యంక‌ర మాస్ హీరోగా ఎలా ఉంటాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం. ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news