Newsఅన్న క‌ళ్యాణ్‌రామ్‌కు హిట్ ఇచ్చేదాకా ఎన్టీఆర్ వ‌దిలేట్టు లేడే... !

అన్న క‌ళ్యాణ్‌రామ్‌కు హిట్ ఇచ్చేదాకా ఎన్టీఆర్ వ‌దిలేట్టు లేడే… !

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ సినిమా దేవ‌ర‌. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా నుంచి భారీ ట్రీట్ కూడా రాబోతోంది. ఈ సినిమాను వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 5న థియేట‌ర్ల‌లోకి తీసుకు రానున్నాడు.

త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ త‌న అన్న క‌ళ్యాణ్‌రామ్‌ను హీరోగా, నిర్మాత‌గా నిల‌బెట్టే విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటాడు. క‌ళ్యాణ్‌రామ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే జై ల‌వ‌కుశ సినిమా చేసి క‌ళ్యాణ్‌రామ్‌ను ఒడ్డున ప‌డేశాడు.

ఇప్పుడు దేవ‌ర‌, ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించే సినిమాల్లోనూ క‌ళ్యాణ్‌రామ్ స‌హ‌నిర్మాత‌గా ఉన్నారు. ఇక క‌ళ్యాణ్‌రామ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ బింబిసార సినిమాను ఎన్టీఆర్ ఎలా ప్ర‌మోట్ చేశాడో చూశాం. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న డెవిల్ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది. ట్రైల‌ర్ వ‌చ్చాక అంద‌రికి గూస్‌బంప్స్ వ‌చ్చేస్తున్నాయి. సినిమాను ఎప్పుడు చూస్తామా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది.

ఈ క్ర‌మంలోనే త‌న అన్న‌కు ఎలాగైనా హిట్ రావాల‌ని.. అందుకోసం త‌న వంతుగా ప్ర‌మోట్ చేయాల‌ని ఎన్టీఆర్ డిసైడ్ అయిపోయాడు. డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. మరి కళ్యాణ్ రామ్ గ‌త రెండు సినిమాల‌కు కూడా ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఇప్పుడు డెవిల్ విజ‌యం కోసం త‌న‌వంతుగా ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news