Moviesఅభిమానులే టైటిల్ పెట్టిన బాల‌య్య సినిమా ఏదో తెలుసా... !

అభిమానులే టైటిల్ పెట్టిన బాల‌య్య సినిమా ఏదో తెలుసా… !

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణకు లక్షలో అభిమానులు ఉంటారు. ఒకే కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు కూడా బాలయ్యకు అభిమానులుగా ఉండటం అంటే.. కచ్చితంగా బాలయ్య అంటే తెలుగు ప్రజలు ఎంతలా ప్రాణం ఇస్తారో తెలుస్తోంది. ఈ వయసులోనూ వరుస సూపర్ డూపర్ హిట్‌లతో దూసుకుపోతున్న బాలయ్యను1980లో యువత పిచ్చిపిచ్చిగా ఆరాధించేవారు. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన ఒక సినిమా టైటిల్ ఆయన అభిమానులే పెట్టారు. ఆ సినిమా టైటిల్ ఏంటి.. ఆ విశేషాలు ఏంటో.. చూద్దాం. బాలయ్య కెరీర్‌లో 33వ సినిమాగా అల్లరి కృష్ణయ్య సినిమా తెరకెక్కింది.

వనితా ఆర్ట్స్ సంస్థ బ్యానర్‌పై ఎన్. భాస్కర్, సి.హెచ్.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. 1986 జూన్ 10న బాలయ్య పుట్టినరోజు నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మద్రాస్ ఏవీఎం స్టూడియోలో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగుతుంది. నాలుగు షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తయింది. అరకులోయ ప్రకృతి అందాల నేపథ్యంలో తీసిన పాటలు కనువిందు చేస్తాయి. ఈ సినిమాకు టైటిల్ పెట్టే బాధ్యతను అప్పటి ప్రముఖ సినీవార పత్రిక శివరంజనికి అప్పగించారు. శివరంజని పాఠ‌కుల సలహాలను ఆహ్వానించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు విశేషంగా స్పందించారు. వేలాది పేర్లు సూచించారు. చివరికి దర్శక నిర్మాతలకు అల్లరి కృష్ణయ్య అనే పేరు నచ్చింది. ఈ టైటిల్‌ను దాదాపు 300 మంది సూచించారు. అయితే సినిమా షూటింగ్ నేపథ్యంలో ఏవీఎం స్టూడియోలో లక్కీ డీప్ నిర్వహించారు. హీరో బాలకృష్ణ.. డ్రా తీశారు. ఇందులో విజేతగా పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన బి.ప్రకాష్ విజేతగా నిలిచారు. ఈ సినిమాలో బాలకృష్ణ, జగ్గయ్య, రావు గోపాలరావు చక్కగా నటించారు. హీరోయిన్‌గా భానుప్రియ అభినయం అదిరిపోయింది.

చక్రవర్తి బాణీలు ఆకట్టుకుంటాయి. సత్యానందం మాటలు బాగున్నాయి. అయితే దర్శకుడుగా నందమూరి రమేష్ అంతగా మెరుపులు మెరూపించలేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేకపోయింది. అయితే అభిమానులు బాలయ్య సినిమాకు టైటిల్ పెట్టిన సినిమాగా అల్లరి కృష్ణయ్య చరిత్రలో నిలిచిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news