Newsఅమ్మ దీనమ్మ.. సడెన్ గా సమంత ఇంత షాక్ ఇచ్చింది ఏంటి..?

అమ్మ దీనమ్మ.. సడెన్ గా సమంత ఇంత షాక్ ఇచ్చింది ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో సమంత అన్న పేరు వినపడగానే జనాలు ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతూ ఉంటారో మనకు తెలిసిందే . ఒకప్పుడు సమంత అని తెలియగానే తెగ లైకులు అప్రిసియేషన్లు కనిపించేవి . అయితే ఈ మధ్యకాలంలో కూసింత అవి తగ్గాయనే చెప్పాలి. మరి ముఖ్యంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంతను కొందరు జనాలు పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు . కానీ అవి ఏమాత్రం పట్టించుకోని సమంత లైఫ్ లో ముందుకెళ్ళిపోతుంది .

అంతేకాదు సమంత అరుదైన వ్యాధికి కూడా గురైంది . ఈ క్రమంలోనే ఆమె ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి పలు దేశాలు తిరిగి సపరేట్ డైట్ ఫాలో అవుతుంది . కాగా లేటెస్ట్ గా ఉన్న సమాచారం ప్రకారం సమంత ఆ జబ్బు నుండి పూర్తిగా కోలుకుంది అనే చెప్పాలి . అయితే తాజాగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది సమంత . లేటెస్ట్ గా ఆమె తన కొత్త జర్నీని ప్రారంభిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది . ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది .

ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించింది . “ట్రాలాలా” మూవింగ్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేసింది . ఈ విషయాని అఫీషియల్ గా ప్రకటించింది. అయితే సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోల్కున్నాక ఏ సినిమాకి అయినా సైన్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంది అని అనుకున్నామని .. ఇలా కొత్త ప్రొడక్షన్ హౌస్ పెట్టి అభిమానులకు ఊహించిన షాక్ ఇచ్చిందని.. అంటే ఇకపై సమంత హీరోయిన్గా సినిమాలు చేయాలని అనుకోవడం లేదు అనేగా అంటూ కొందరు ఆమె నిర్ణయాన్ని ద్వందర్థంలో చూస్తున్నారు. మరికొందరు సమంత ఇచ్చిన షాక్ అద్దిరిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఏకంగా అమ్మ దీనమ్మ సమంతకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా ..? బ్యాగ్రౌండ్ లో బాగానే స్కెచ్ వేసింది గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news