Moviesసోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్న అలియా భట్ కూతురి ఫోటో.....

సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్న అలియా భట్ కూతురి ఫోటో.. ఎంత ముద్దుగా ఉందో చూడండి..!!

అలియా భట్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోయిన్ . తెలుగులో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో తన నటనను అభిమానులకు పరిచయం చేసింది . కాగ బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తో డేటింగ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియా భట్ పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ చెప్పి బిగ్ షాక్ ఇచ్చింది . అప్పట్లో ఈ న్యూస్ బాగా హంగామా చేసింది. అంతేకాదు ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ అలియా భట్ తన ప్రెగ్నెన్సీను బాగా ఎంజాయ్ చేసింది.

కాగా 9 నెలల తర్వాత అలియా భట్ కు బంగారం లాంటి కూతురు పుట్టింది . ఆమె పుట్టి సంవత్సరం దాటుతున్న ఇప్పటివరకు ఆమెకు సంబంధించిన ఫోటో ని ఎప్పుడు షేర్ చేయలేదు అలియా భట్ రన్బీర్ కపూర్ .కాగ రీసెంట్గా అలియా భట్ తన కూతురు పుట్టిన రోజు కావడంతో క్యూట్ గా ఉండే తన కూతురు చేతులను షేర్ చేసింది . చాలా ముద్దుగా ఉన్నాయి పాప చేతులు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టే లోపే రన్బీర్ కపూర్ తన కూతుర్ని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది .

“simplyaminaofficial”అనే పేరుతో ఉన్న ఇంస్టాగ్రామ్ లో అలియా భట్ కూతురు ముఖం కనిపిస్తున్న ఫోటో షేర్ చేయడం గమనార్హం. ఇప్పుడు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది . రాహ చాలా ముద్దు ముద్దుగా ఉంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే అచ్చం అలియా భట్ లానే ఉంది అంటున్నారు అభిమానులు. మరి మీకు ఈ పాప ఎలా అనిపిస్తుంది..అలియా భట్ లా నా..? రణబీర్ కపూర్ లానా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news