Moviesప్రభాస్ హీరో అని తెలిసి "రాధ రమ" పాత్రను రిజెక్ట్ చేసిన...

ప్రభాస్ హీరో అని తెలిసి “రాధ రమ” పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ .. పిచ్చి పీక్స్ కి చేరడం అంటే ఇదే..!!

సలార్ .. సలార్ .. సలార్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తూ మారుమ్రోపోతుంది . మరీ ముఖ్యంగా సినిమా ఎవరు ఊహించిన దాని కంటే ట్రిపుల్ స్థాయిలో హిట్ అవ్వడంతో బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తుంది. కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండోరోజు కూడా 150 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసేసింది . అయితే ఈ సినిమాలో శ్రీయా రెడ్డి పాత్రలో మొదటగా స్టార్ హీరో కూతుర్ని అనుకున్నారట ప్రశాంత్ నీల్.

ప్రభాస్ కి యాంటీ రోల్ ల్లో కనిపించే శ్రియా రెడ్డి పాత్ర కోసం ముందుగా వరలక్ష్మి శరత్ కుమార్ ను అప్రోచ్ అయ్యారట . కానీ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . అంతేకాదు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాల్లో నటిస్తే క్రేజ్ మొత్తం ప్రభాస్ కి వెళ్ళిపోతుంది తప్పిస్తే జనాలు పక్కన ఉండే రోల్స్ ని పట్టించుకోరు అని .. పైగా జగపతిబాబు – పృథ్వీరాజ్ లాంటి స్టార్స్ ఉన్నప్పుడు తన రోల్ ని ఎవరు పట్టించుకుంటారు అన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్ తో ఈ పాత్రను మిస్ చేసుకుందట .

కానీ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత చాలా బాధపడిపోయిందట , ఆ పాత్ర చేసుంటే బాగుండేదేమో అంటూ అనుకునిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మొత్తానికి శ్రియా రెడ్డి లక్కి ఛాన్స్ కొట్టేసింది. వరలక్షి ఈ పాత్ర చేసుంటే మాత్రం కెవ్వు కేక అనే చెప్పాలి. మంచి రోల్ ని మూర్ఖత్వం కారణంగా మిస్ అయిపోయింది..పాపం ఏం చేద్దాం..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news