Movies"సలార్" లో సురభి పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?...

“సలార్” లో సురభి పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈ ఆఫర్ ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ప్రభాస్ తాజాగా నటించిన సినిమా సలార్ . భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో ..భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసి పడేస్తుంది . మొదటి రోజు 188 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డులను నెలకొల్పింది. బాక్సాఫీస్ వద్ద కాటేరమ్మ కొడుకుగా ప్రభాస్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు .

ఈ క్రమంలోనే సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . కాగా సినిమా మొత్తానికి ప్రభాస్ పృథ్వీరాజ్ పాత్ర ఎంత హైలెట్ అయిందో శ్రియా రెడ్డి – సురభి పాత్ర కూడా అంతే హైలెట్గా అయ్యింది . ఈ సినిమాలో చిన్న పాప క్యారెక్టర్ లో కనిపించిన సురభికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. రెండేళ్ల వయసులో ఐపీఎల్ తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలో కూడా ఈ పాప కనిపిస్తుంది .

ఈ పాప అసలు పేరు సయ్యద్ ఫర్జనా. పలు స్కూల్ యాడ్స్ లో నటించిన ఫర్జనాకు సలార్లో క్యారెక్టర్ కోసం మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ వాళ్లు సెలెక్ట్ చేసుకున్నారట. సురభి పాత్రకు ఎంతోమంది ఆడిషన్ కి వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫర్జనా కే చెప్పారట. అంత బాగ హవ భావాలు పలికించగలదు. “ప్రభాస్- పృథ్వీరాజ్ లాంటి స్టార్ట్స్ తో నటించడం చాలా ఆనందంగా ఉందని ..షూటింగ్ టైం మొత్తం నాకు ఎంతో ఎంటర్టైన్మెంట్ గా అనిపించిందని ..ఓవైపు స్కూల్ స్టడీస్ మరోవైపు షూటింగ్ కలిసి పూర్తి చేసుకున్నానని.. నా పాత్ర కోసం ఏడు షెడ్యూల్స్ పది రోజుల షూట్ పట్టిందని చెప్పుకొచ్చింది. సోలార్ రిలీజ్ తర్వాత అందరూ తనని గుర్తుపట్టి పొగుడుతూ ఉంటే హ్యాపీగా ఉంది “అంటూ చెప్పుకొచ్చింది . సురభి పాత్రలో అందరిని మెప్పించిన ఫర్జనాకు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి రోల్స్ రావాలని ఆశిద్దాం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news