News"రాసిపెట్టుకోండి..ఒక్క వేళ అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా".. మృణాల్ ఠాకూర్...

“రాసిపెట్టుకోండి..ఒక్క వేళ అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా”.. మృణాల్ ఠాకూర్ బోల్డ్ స్టేట్మెంట్ విన్నారా..!!

ప్రజెంట్ మృణాక్ ఠాకూర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . ఇన్నాళ్లు సైలెంట్ గా చాలా పద్ధతిగా చాలా కూల్ క్లాసిక్ గా ఆకట్టుకున్న మృణాల్ ఫస్ట్ టైం చాలా చాలా బోల్డ్ గా స్పందించింది . “రాసి పెట్టుకోండి ఒకవేళ నేను చెప్పింది జరగకపోతే ఖచ్చితంగా నా పేరు మార్చుకుంటా” అంటూ కోట్లాదిమంది జనాల సమక్షంలోనే సవాల్ చేసింది .

దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ అంతకు ముందు పలు సినిమాల్లో సీరియల్స్ లో నటించినా.. సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . మృణాల్ ఠాకూర్ ప్రజెంట్ ‘హాయ్ నాన్న’ సినిమాలో నటించింది. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

వైజాగ్ లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా అట్రాక్టివ్ లుక్స్ తో ఆకట్టుకునింది మృణాల్. ఈ క్రమంలోనే స్టేజ్ పైకి వచ్చిన ఆమె మాట్లాడుతూ ..”ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుంది బాగా ఆకట్టుకుంటుంది . ఈ సినిమాలో చాలా చాలా మంచి సీన్స్ ఉన్నాయి . ప్రతి ఒక్క తండ్రి కూతురు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు . దర్శన అనే పాటతో మ్యూజిక్ డైరెక్టర్ హేమేషి అబ్దుల్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు . ఆయనతో ప్రేమలో పడిపోయా. దర్శనా పాటలాగే ఈ సినిమాలోని ఓ పాట ఉంది . మరీ ముఖ్యంగా నాని పాప మధ్య వచ్చే బాండింగ్ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి ..రాసి పెట్టుకోండి సినిమా చూశాక వారితో మీరు ప్రేమలో పడిపోతారు . ఒకవేళ పడకపోతే నా పేరు మార్చుకుంటా ” అంటూ హీరోయిన్ మృణాల్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news