News"ఆ తెలుగు హీరోనే పెళ్లి చేసుకుంటా"..సిగ్గు పడకుండా ఓపెన్ గా చెప్పేసిన...

“ఆ తెలుగు హీరోనే పెళ్లి చేసుకుంటా”..సిగ్గు పడకుండా ఓపెన్ గా చెప్పేసిన మృణాల్ ఠాకూర్(వీడియో)..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మాట తూలకూడదు. మాట తూలితే ఆ మాటలను గుర్తు చేసుకుంటూ మండే వరకు మంట పెడుతూ ట్రోల్ చేస్తూనే ఉంటారు జనాలు . రీసెంట్గా అలాంటి తప్పే చేసింది మృణాల్ ఠాకూర్ . ఓ ఫంక్షన్ లో స్టేజిపై మాట్లాడుతూ .. అల్లు అరవింద్ – మృణాల్ ఠాకూర్ ను తెలుగు ఇంటి కోడలు కావాలి అంటూ ఆశీర్వదించారు . అంతే అక్కడ నుంచే అమ్మడు తెలుగు అబ్బాయిని ప్రేమిస్తుంది అని.. తెలుగు హీరోతో పెళ్లి చేసుకోబోతుంది అని .. తెలుగు ఇంటికి కోడలుగా రాబోతుంది అని.. రకరకాల వార్తలు వైరల్ అయిపోయాయి .

చాలా సైలెంట్ గా ఓపికగా చూసిన మృణాల్ ఠాకూర్ ఇక వాటిపై రెస్పాండ్ అయింది . అంతేకాదు తన కుటుంబ సభ్యులు తెలిసినవాళ్లు అందరూ పెళ్లెప్పుడు ..? ఆ హీరో ఎవరు..? అంటూ తెగ విసిగించేస్తున్నారట . దీంతో మృణాల్ ఠాకూర్ తన ఇంస్టాగ్రామ్ లో వీడియోని షేర్ చేసింది . “నేను ఓ తెలుగు హీరోని పెళ్లి చేసుకోబోతున్నాను అని వార్తలు వినిపిస్తున్నాయి.. సారీ ఈ విషయం మీకు హర్టిం గా ఉండొచ్చు ..ఇంతకీ ఆ తెలుగు హీరో ఎవరు..? నాకైనా చెప్పండి..?”

“మీరే వెతికి ఆ అబ్బాయి పేరు నాకు చెప్పి నా పెళ్లి కూడా చేసేయండి ..నేను రెడీ “అంటూ కౌంటర్ గా వీడియోను షేర్ చేసింది. దీనితో మృణాల్ ఠాకూర్ తెలుగు హీరోని ప్రేమిస్తున్నది.. ఆ ఇంటికి కోడలు కాబోతున్నది అని వస్తున్న వార్తలు మొత్తం ఫేక్ అని .. అల్లు అరవింద్ చాలా సరదాగా అన్నాడని .. ఆమె కూడా అంతే సరదాగా తీసుకుందని.. ఇక ఈ విషయాన్ని జనాలు కూడా అంతే సీరియస్ గా తీసుకొని ఆ విషయం నుంచి బయటపడితే మంచిది అని మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news