Newsతూచ్.. "చై" టాటూ ని చెరిపేయని సమంత .. అందరిని బకరాలు...

తూచ్.. “చై” టాటూ ని చెరిపేయని సమంత .. అందరిని బకరాలు చేసేసిందిగా(ఫోటోలు)..!!

సమంత తెలిసి చేస్తుందో .. తెలియక చేస్తుందో తెలియదు కానీ . ఆమె చేసే కొన్ని కొన్ని పనులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమెకు పెద్ద తలనొప్పుల క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి . మనకు తెలిసిందే హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది . ఆ తర్వాత వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు . అయితే సమంత చైతన్యతో కలిసి ఉన్నప్పుడు తన నడుము పై భాగంలో అతని పేరుని టాటూ వేయించుకుంది .

వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఆ టాటూ చాలా సార్లు జనాలకు చూపించింది . అయితే విడాకులు తీసుకున్న తర్వాత రీసెంట్గా ఆమె టాటూను తొలగించుకున్నట్లు ఓ ఫోటోని పరోక్షకంగా షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది . అప్పట్లో ఆమె ఫోటో చాలా వైరల్ గా మారింది. సరేలే ఇక నాగచైతన్యతో కలిసి ఉండలేదు కదా .. అందుకే టాటూ ని తీయించేసుకుందేమో అంటూ జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఆ టాటూ నా నడుము పైనే ఉంది అంటూ పరోక్షకంగా ఫోటోకి ఫోజులిచ్చింది సమంత . రీసెంట్గా ది మార్వెల్స్ ప్రమోషన్స్ కోసం సమంత హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది . ఈ ఫొటోస్ లో ఆమె షర్ట్ పైకి ఎత్తడంతో ఆ టాటూ అలానే కనిపించింది. దీంతో సమంత కేవలం మేకప్ వేసి ఆ టాటూ ని కవర్ చేసింది అని.. చైతన్య పై ప్రేమ అలాగే ఉంది అని .. చైతన్య స్థానం తన మదిలో ఎప్పటికీ టాప్ ప్లేస్ అని చెప్పకనే చెప్పేసింది అంటూ సమంత ఫ్యాన్స్ చెప్తుంటే.. మరికొందరు సమంత టాటూ ఉంచుకుంటే ఏంటి ..? తీసేసుకుంటే ఏంటి ..? ఇంకేం మీకు పని పాట లేదా ..? అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news