Newsఅయ్యయ్యో.. శేఖర్ మాస్టర్ కూడా ఆ విషయంలో మోసపోయాడే..పాపం..సాహితి ఇలా చేస్తుంది...

అయ్యయ్యో.. శేఖర్ మాస్టర్ కూడా ఆ విషయంలో మోసపోయాడే..పాపం..సాహితి ఇలా చేస్తుంది అనుకోలేదుగా(వీడియో)..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయాక ఆన్లైన్ మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి . మరీ ముఖ్యంగా యూట్యూబ్లో పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడానికి సామాన్య జనాలను.. పలువురు యూట్యూబర్స్ ను పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే కొంతమంది సక్సెస్ అవుతుంటే .. మరి కొంతమంది మోసాలకు పాల్పడి డబ్బులు దొబ్బేస్తున్నారు.

రీసెంట్గా ఇలాంటివి ఎన్నో జరిగాయి. రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది శేఖర్ మాస్టర్ కూతురు సాహితి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అంతేకాదు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ కూడా పలు కవర్ సాంగ్స్ లో నటించి డాన్స్ చేసి బాగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. అయితే రీసెంట్గా సాహితీ పేరు చెప్పి కొందరు ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారట .

ఇదే విషయం శేఖర్ మాస్టర్ దృష్టికి రావడంతో ఆయన ఓ వీడియోని రిలీజ్ చేశారు . “మీ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తాను అంటూ కొన్ని ఫేక్ అకౌంట్స్ నాకు కూతురి పేరుపై క్రియేట్ చేసి మెసేజ్లు పెడుతున్నారట . ప్రమోషన్ కోసం డబ్బును అడుగుతున్నారట. దయచేసి అలాంటివి నమ్మకండి .. నా కూతురుకు ఉండే ఐడి ఇదే .. ఒక్కటే ఐడి.. నా కూతురు ఐడిని నేను ఫాలో అవుతున్నాను. మిగతా ఉన్నవి ఫేక్ అకౌంట్ నా కూతురుది కాదు.. దయచేసి గమనించగలరు అంటూ శేఖర్ మాస్టర్ వీడియోని రిలీజ్ చేశారు . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news